Share News

kumaram bheem asifabad- గణేశ్‌ ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించుకోవాలి

ABN , Publish Date - Aug 26 , 2025 | 10:46 PM

గణేశ్‌ ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించుకోవాలని ఎస్సై నరేష్‌ అన్నారు. మండల కేంద్రంలోని పోలీసు స్టేషన్‌ ఆవరణలో మంగళవారం వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు, మాజీ ప్రజాప్రినిధులు, అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు.

kumaram bheem asifabad- గణేశ్‌ ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించుకోవాలి
చింతలమానేపల్లిలో మాట్లాడుతున్న ఎస్పై నరేష్‌

చింతలమానేపల్లి, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): గణేశ్‌ ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించుకోవాలని ఎస్సై నరేష్‌ అన్నారు. మండల కేంద్రంలోని పోలీసు స్టేషన్‌ ఆవరణలో మంగళవారం వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు, మాజీ ప్రజాప్రినిధులు, అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయక ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవడంతో పాటు భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని, ప్రతి వినాయక మండలి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నిమజ్జన సమయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని ఎలాంటి అవాంచీనయ సంఘటనలు చోటు చేసుకోకుండా చూడాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ డీజేలకు అనుమతి లేదన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ దౌలత్‌, ఎంపీడీఓ సుధాకర్‌రెడ్డి, కార్యదర్శులు, ఉత్సవ నిర్వాహకులు పాల్గొన్నారు.

బెజ్జూరు, (ఆంధ్రజ్యోతి): గణేశ్‌ నవరాత్రి ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలని తహసీల్దార్‌ రామ్మోహన్‌, సీఐ సంతోష్‌లు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో గణేష్‌ ఉత్సవ కమిటీ సభ్యులు, మాజీ ప్రజాప్రతినిధులు, ముస్తి శాంతి కమిటీ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో ఎంపీడీఓ ప్రవీణ్‌కుమార్‌, ఎంపీఓ గౌరి శంకర్‌, ఎస్సై సర్తాజ్‌ పాషా తదితరులు పాల్గొన్నారు.

పెంచికలపేట, (ఆంధ్రజ్యోతి): గణేశ్‌ నవరాత్రి ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలని సీఐ కుమారస్వామి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని స్థానిక పోలీసు స్టేషన్‌లో ఉత్సవ కమిటీ, మాజీ ప్రజాప్రతినిధులు, యువకులతో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎస్సై అనిల్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

కౌటాల, (ఆంధ్రజ్యోతి): గణపతి ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని సీఐ సంతోష్‌కుమార్‌, ఎస్సై విజయ్‌లు అన్నారు. గణేష్‌ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు.

సిర్పూర్‌(యు), (ఆంధ్రజ్యోతి): గణేశ్‌ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్సై రామకృష్ణ కోరారు. మండల కేంద్రంలో నిర్వహించిన శాంతి కమిటి సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశంలో ఎంపీడీవో క్రిష్ణారావ్‌, తహసీల్దార్‌ ప్రహ్లద్‌, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ ఆత్రం భగ్వంత్‌రావ్‌, గ్రామ పటేల్‌ ఆత్రం ఆనంద్‌రావ్‌, కమిటీ సభ్యులు అనిల్‌, అక్తర్‌, సత్తార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 26 , 2025 | 10:46 PM