kumaram bheem asifabad-గాంధీ పేరును కొనసాగించాలి
ABN , Publish Date - Dec 21 , 2025 | 09:50 PM
ఉపాధి హామీ పథకానికి గాంధీ పేరును బీజేపీ ప్రభుత్వం కొనసాగించాలని డీసీసీ అధ్యక్షురాలు అత్రం సుగుణ అన్నారు. ఉపాధిహామీ పథకం నుంచి గాంధీ పేరును కేంద్ర ప్రభుత్వం తొలగించినందుకు నిరసనగా ఏఐసీసీ, టీపీసీసీ ఆదేశాల మేరకు డీసీసీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు.
ఆసిఫాబాద్‌రూరల్, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ పథకానికి గాంధీ పేరును బీజేపీ ప్రభుత్వం కొనసాగించాలని డీసీసీ అధ్యక్షురాలు అత్రం సుగుణ అన్నారు. ఉపాధిహామీ పథకం నుంచి గాంధీ పేరును కేంద్ర ప్రభుత్వం తొలగించినందుకు నిరసనగా ఏఐసీసీ, టీపీసీసీ ఆదేశాల మేరకు డీసీసీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షురాలు అత్రం సుగుణ మాట్లాడుతూ ఉపాధిహామీ పథకానికి తిరిగి గాంధీ పేరు పెట్టే వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు ఆగవని అన్నారు. గాంధీ కుటుంబం పేరు పలికితేనే బీజేపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని చెప్పారు. గాడ్సేను పూజించే మనస్తతత్వం కలిగిన వారే ఉపాధిహామీ పథకం నుంచి గాంధీ పేరు తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు కనీసం 100 రోజుల ఉపాధి కల్పించే ఉపాధిహామీ పథకాన్ని నిర్వీర్యం చేయడమే బీజేపీ లక్ష్యంగా పెట్టుకుందన్నారు. 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం ఈ పథకానికి నిధుల కోతలు పెడుతుందన్నారు. అంతకు ముందు గాంధీచౌక్‌లోని గాంధీ విగ్రహనికి పూలమాలలు వేసి అక్కడి నుంచి అంబేద్కర్ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్‌రావు, మాజీ ఎంపీపీ బాలేశ్వర్‌గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు శ్యామ్, కాంగ్రెస్‌పార్టీ ఆసిఫాబాద్, జైనూరు, కెరమెరి, తిర్యాణి, వాంకిడి మండలాల అధ్యక్షులు చరణ్, ముఖీద్, కుసుంరావు, సాగర్, నారాయణ, నాయకులు సుధాకర్, తిరుపతి, జక్కన్న, సత్తన్న, మురళీ, అసద్, మంగ, వందన, ఇందిరబాయి తదితరులు పాల్గొన్నారు.
బెజ్జూరు, (ఆంధ్రజ్యోతి): బెజ్జూరు మండల కేంద్రంలో మహత్మగాంధీ ఉపాధిహామీ పథకం నుండి గాంధీ పేరును తొలగించడాన్ని నిరసిస్తూ ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాచకొండ శ్రీవర్థన్, మండల పార్టీ అధ్యక్షుడు శంకర్, నాయకులు విశ్వేశ్వర్, లక్ష్మి, శైలజ, లక్ష్మణ్, హనుమంతు తదితరులు పాల్గొన్నారు.