Compassionate Appointments: కారుణ్య నియామకాలకు ధ్రువీకరణ పత్రాలు సమర్పించండి
ABN , Publish Date - Aug 21 , 2025 | 04:32 AM
వివిధ శాఖల్లో కారుణ్య నియామకాలకు అవసరమైన అన్ని రకాల ధ్రువీకరణ పత్రాలను దరఖాస్తులతో సహా సమర్పించాలని, ఈ విషయంలో ఆయా శాఖల ముఖ్యకార్యదర్శులు
ముఖ్యకార్యదర్శులకు సాధారణ పరిపాలనా శాఖ ఉత్తర్వులు
హైదరాబాద్, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): వివిధ శాఖల్లో కారుణ్య నియామకాలకు అవసరమైన అన్ని రకాల ధ్రువీకరణ పత్రాలను దరఖాస్తులతో సహా సమర్పించాలని, ఈ విషయంలో ఆయా శాఖల ముఖ్యకార్యదర్శులు తగిన చర్య లు తీసుకోవాలని సాధారణ పరిపాలనా శాఖ(జీఏడీ) ఆదేశించింది. సంబంధిత ధ్రువీకరణ పత్రాలు లేకపోవడం వల్ల కారుణ్య నియామకాల్లో జాప్యం జరుగుతోందని జీఏడీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బెన్‌హర్ మహేశ్ దత్ ఎక్కా జారీ చేసిన ఉత్తర్వుల్లో తెలిపారు.
ఉద్యోగులు మరణించినప్పుడు లేదా మెడికల్ ఇన్‌వాలిడేషన్ కారణంగా పదవీ విరమణ పొందిన ఉద్యోగుల సంబంధీకులకు కారుణ్య నియామకాలు ఉంటాయని తెలిపారు. నియామకాలకు సంబంధించి ఉద్యోగి మరణ ధ్రువీకరణ పత్రం, మెడికల్ ఇన్‌వాలిడేషన్ సర్టిఫికెట్, వారసత్వ ధ్రువీకరణ తదితర పత్రాలన్నింటినీ దరఖాస్తులతో జతపర్చాలని సూచించారు.