Deputy CM Bhatti: బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ స్కీమ్ నిధులు చెల్లిస్తాం
ABN , Publish Date - Oct 15 , 2025 | 04:26 AM
ఏవైనా సమస్యలు తలెత్తితే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ యాజమాన్యాలు సంబంధిత జిల్లా అధికార యంత్రాంగాన్ని సంప్రదించాలే గానీ...
బకాయిల వివరాలను పంపండి: డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): ఏవైనా సమస్యలు తలెత్తితే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ యాజమాన్యాలు సంబంధిత జిల్లా అధికార యంత్రాంగాన్ని సంప్రదించాలే గానీ, విద్యార్థులను స్కూళ్ల నుంచి పంపి వేయడానికి వీల్లేదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌తో కలిసి ఆయన.. ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘బెస్ట్ అవైలబుల్ స్కూల్స్’ స్కీమ్‌పై మంగళవారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. విద్యా రంగాన్ని ప్రతిష్ఠాత్మకంగా పరిగణిస్తున్న తమ సర్కారు ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. ఈ స్కీమ్ కింద ఆయా పాఠశాలలకు చెల్లించాల్సిన బకాయిల వివరాలు పంపాలని కలెక్టర్లను ఆయన ఆదేశించారు. సదరు బకాయిల్లో కొంత మొత్తం వెంటనే విడుదల చేస్తామని చెప్పారు. నిధులు రాకపోవడంతో కొన్నిచోట్ల స్కూళ్లు మూసేశారన్న సమాచారం ఉందని, ఆ స్కూళ్లను సందర్శించి నివేదిక సమర్పించాలని సంబంధిత డీఈవోలను ఆయన ఆదేశించారు.