Share News

నిధులు మంజూరు చేయాలి

ABN , Publish Date - Sep 18 , 2025 | 11:13 PM

కల్వకుర్తి, అచ్చంపేట నియోజక నియోజకవర్గంలోని ఆర్‌అండ్‌బీ రోడ్ల వైడెనింగ్‌లకు నిధులు మంజూరు చేయాలని ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యే కశిరెడ్డి నారా యణరెడ్డి, చిక్కుడు వంశీకృష్ణ సీఎం రేవంత్‌ రెడ్డిని కలిసి విన్నవించారు.

నిధులు మంజూరు చేయాలి

- సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన కల్వకుర్తి, అచ్చంపేట ఎమ్మెల్యేలు కశిరెడ్డి నారాయణరెడ్డి, డాక్టర్‌ వంశీకృష్ణ

- ఆర్‌ఆర్‌ఆర్‌లో భూములు కోల్పోతున్న రైతులకు నష్టం జరగకుండా చూడాలని విన్నపం

కల్వకుర్తి/ అచ్చంపేట/ వంగూరు, సెప్టెంబ రు 18 (ఆంధ్రజ్యోతి) : కల్వకుర్తి, అచ్చంపేట నియోజక నియోజకవర్గంలోని ఆర్‌అండ్‌బీ రోడ్ల వైడెనింగ్‌లకు నిధులు మంజూరు చేయాలని ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యే కశిరెడ్డి నారా యణరెడ్డి, చిక్కుడు వంశీకృష్ణ సీఎం రేవంత్‌ రెడ్డిని కలిసి విన్నవించారు. ఆర్‌ఆర్‌ఆర్‌ రీజనల్‌ రింగ్‌ రోడ్డులో భాగంగా భూములు కోల్పోతున్న రైతులకు నష్టం జరగకుండా చూడాలని సీఎంకు వారు వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్యే కశి రెడ్డి నారాయణరెడ్డి కల్వకుర్తి- అచ్చంపేట ని యోజకవర్గాలను కలిపే ఆర్‌అండ్‌ రోడ్ల వైడెనిం గ్‌కు నిధులు మంజూరు చేయాలని కోరారు. క ల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమనగల్‌, మాడ్గు ల, తలకొండపల్లి మండలాల వివిధ గ్రామాల్లో రీజనల్‌ రింగ్‌ రోడ్డులో భాగంగా భూములు కో ల్పోతున్న బాధితులకు న్యాయంజరిగేలా చూడా లని పేర్కొన్నారు. తమకు న్యాయం చేయాలని రైతులు బాధితులు నిరసన తెలిపిన విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. భూబాధితులకు మార్కెట్‌ వాల్యూ ప్రకారం పరిహారం అందేలా చూడాలని రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా సా నుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే కశిరెడ్డి తె లిపారు. అచ్చంపేట నియోజకవర్గంలో పెండిం గ్‌ పనులకు నిధుల విడుదలతో పాటు నియో జకవర్గానికి వెయ్యి ఇందిరమ్మ ఇళ్లు కేటాయించా లని, ఉల్పర నుంచి కల్వకుర్తి వరకు బీటీ రోడ్లు మంజూరు చేయాలని సీఎంనుకోరినట్లు ఎమ్మె ల్యే తెలిపారు. కోరారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల నూతన భవణ నిర్మాణానికి నిధులు విడదల చేయాలని ఆయన వినతి ప త్రంలో పేర్కొన్నారు.. సానుకూలంగా స్పందిం చిన ముఖ్యమంత్రి ఆయాశాఖల అధికారులకు వెంటనే ఆదేశాలు ఇచ్చినట్లు ఎమ్మెల్యే వంశీకృష్ణ తెలిపారు.

Updated Date - Sep 18 , 2025 | 11:13 PM