Share News

kumaram bheem asifabad- చేనేత రుణమాఫీకి నిధులు మంజూరు

ABN , Publish Date - Jul 17 , 2025 | 11:13 PM

చేనేత కార్మికులకు గత అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీపై కీలక నిర్ణయం తీసుకున్నారు. చేనేత కార్మికులకు రుణమాఫీ నిధులు మంజూరు చేస్తూ ఆదేశాలిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆదేశాలతో రాష్ట్ర చేనేత, జౌళి శాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు

kumaram bheem asifabad- చేనేత రుణమాఫీకి నిధులు మంజూరు
లోగో

- ముఖ్యమంత్రి ఆదేశాలతో చేనేతశాఖ కసరత్తు

- ఎన్నికల హామీ నెరవేర్చిన ప్రభుత్వం

కాగజ్‌నగర్‌ టౌన్‌, జూలై 17 (ఆంధ్రజ్యోతి): చేనేత కార్మికులకు గత అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీపై కీలక నిర్ణయం తీసుకున్నారు. చేనేత కార్మికులకు రుణమాఫీ నిధులు మంజూరు చేస్తూ ఆదేశాలిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆదేశాలతో రాష్ట్ర చేనేత, జౌళి శాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు. రాష్ట్రంలో రుణాలు తీసుకున్న చేనేత కార్మికుల వివరాలను సేకరిస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని 34 మంది కార్మికులకు సంబంధించిన రూ. 17 లక్షలు మాఫీ చేస్తున్నారు. జిల్లాలోని 8 మందితో కూడిన కమిటీ కలెక్టర్‌ ఆదేశాలతో సర్వే చేపట్టి రాష్ట్ర కమిటీకి వివరాలతో నివేదికను అందజేయనుందని కాగజ్‌నగర్‌ చేనేత పారిశ్రామిక సహకార ఉత్పత్తి, విక్రయ సంఘం లిమిటెడ్‌ (బెజ్జూరు) కార్యదర్శి నల్ల కనకయ్య చెప్పారు. గత మార్చినెలలో రుణమాపీకి ఆర్థిక శాఖ నుంచి అనుమతులు రాగా, గైడ్‌లైన్స్‌ ప్రకారం అధికారులు అర్హులను గుర్తించడంతో నిధులు విడుదలయ్యాయి.

- మగ్గాల పని చేసే..

జిల్లాలో మగ్గాల పని చేసే 30 మంది కార్మికులు 2014-17 సంవత్సరంలో తీసుకున్న రూ. లక్ష వ్యకి గత రుణాలు గతంలో మాఫీ ఆయ్యాయి. తిరిగి 2017-2024 మధ్య తీసుకున్న రుణాలు కూడా మాఫీ చేశారు. కాగజ్‌నగర్‌లో 12 మందితో పాటు జిల్లా వ్యాప్తంగా ఒక్కొక్కరు రూ. 50 వేల రుణం పొందారు. జిల్లా వ్యాప్తంగా 173 మంది కార్మికులు మగ్గాలు నేస్తున్నారు. చేనేత కార్మికులు తీసుకున్న వ్యక్తి గత రుణాలు మాత్ర మే మాఫీ అయ్యాయని సంఘం నాయకులు తెలిపా రు. రూ. లక్ష వరకు మాఫీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా రుణాలు, ఇతర వివరాలు పరిగణలోకి తీసుకొని నివేదికలు తయారు చేస్తున్నారు. గైడ్‌లైన్స్‌ ప్రకారం రుణ మాఫీ అయిన తర్వాత ఆ మొత్తాలకు బ్యాంకుల నుంచి ఖాతాదారులకు సమాచారం అందిస్తారు.

త్వరలోనే అందించాలి..

- నల్ల కనకయ్య, చేనేత పారిశ్రామిక సహకార ఉత్పత్తి, విక్రయ సంఘం లిమిటెడ్‌ కార్యదర్శి

చేనేత కార్మికులకు మంజూరైన రుణ మాఫీ డబ్బు లు త్వరితగతిన కార్మికులకు అందించాలి. గతంలో ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ముఖ్య మంత్రి నిర్ణయం తీసుకోవడం సంతోషకరం. కాగజ్‌న గర్‌లో 21 జియోట్యాగ్‌ మగ్గాలు ఉన్నాయి. ఇందులో 30 మంది కార్మికులు పని చేస్తున్నారు. వీరిలో గతంలో రుణం పొందిన 12 మందికి లబ్ధి చేకూరింది.

Updated Date - Jul 17 , 2025 | 11:13 PM