Share News

kumaram bheem asifabad- మున్సిపాలిటీకి నిధులు మంజూరు

ABN , Publish Date - Nov 18 , 2025 | 11:01 PM

కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీలో అభివృద్ధి పనులకు ఆటంకాలు తొలగిపోనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అన్ని మున్సిపాల్టీలకు నిధులను విడుదల చేసింది. ఇందు లో భాగంగా కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీకి రూ.18.70 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులతో పట్టణంలో అత్యవసరంగా ఉన్న రోడ్లు నిర్మాణం చేపట్టనున్నారు. దీని కోసం ఇటీవల అధికారులు శిథిలావస్థకు చేరిన రోడ్లపై సర్వేలు నిర్వహించారు. నిధులు రానుండడంతో అధికారులు డిటైల్‌ ప్రాజక్టు రిపోర్టు(డీపీఆర్‌) సిద్ధం చేస్తున్నారు.

kumaram bheem asifabad- మున్సిపాలిటీకి నిధులు మంజూరు
కాగజ్‌నగర్‌లో పగుళ్లు తేలిన సర్‌సిల్క్‌- కోసిని రోడ్డు

- సీసీ రోడ్ల నిర్మాణానికి అధికారుల చర్యలు

కాగజ్‌నగర్‌, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీలో అభివృద్ధి పనులకు ఆటంకాలు తొలగిపోనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అన్ని మున్సిపాల్టీలకు నిధులను విడుదల చేసింది. ఇందు లో భాగంగా కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీకి రూ.18.70 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులతో పట్టణంలో అత్యవసరంగా ఉన్న రోడ్లు నిర్మాణం చేపట్టనున్నారు. దీని కోసం ఇటీవల అధికారులు శిథిలావస్థకు చేరిన రోడ్లపై సర్వేలు నిర్వహించారు. నిధులు రానుండడంతో అధికారులు డిటైల్‌ ప్రాజక్టు రిపోర్టు(డీపీఆర్‌) సిద్ధం చేస్తున్నారు. టెక్నికల్‌ అనుమతి పొందగానే టెండర్‌ పనులు ప్రారంభించనున్నారు. కాగజ్‌నగర్‌ మెయిన్‌ మార్కెట్‌ నుంచి ఎన్టీఆర్‌ చౌరస్తా వరకు రోడ్డు అధ్వానంగా మారింది. ఆ రోడ్డుపై పలు చోట్ల గుంతలపడడంతో నిత్యం వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులుపడుతున్నారు. సర్‌సిల్క్‌ రాం మందిర్‌ నుంచి కోసిని డాడానగర్‌ చౌరస్తా వరకు రహదారిపై పగుళ్లు తేలాయి. ఈ రోడ్డు మీదుగా రాకపోకలు సాగించే ఆటోలు, ద్విచక్ర వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వీటితో పాటు డంపింగ్‌ యార్డు వద్ద సీసీ రోడ్డు లేదు. ఈ సమస్యలపై నెల రోజుల క్రితం ఎమ్మెల్యే డాక్టర్‌ పాల్వాయి హరీష్‌ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు కాగజ్‌నగర్‌ మున్సిపాల్టీకి వివిధ అభివృద్ధి పనుల కోసం రూ.18.70 కోట్లు విడుదల అయ్యాయి. నిధులు విడుదల కావడంతో రోడ్ల సమస్యలు పరిష్కారమవుతాయని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు వెంట నే పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయా వార్డుల ప్రజలు కోరుతు న్నారు. ఈ విషయమై మున్సిపల్‌ కమిషనర్‌ రాజేందర్‌ను వివరణ కోరగా అభివృద్ధి పనుల కోసం డీపీఆర్‌లు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. త్వరలోనే పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Updated Date - Nov 18 , 2025 | 11:01 PM