బంద్‌కు సంపూర్ణ మద్దతు
ABN , Publish Date - Oct 17 , 2025 | 11:03 PM
బీసీ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో నేడు జరగబోయే రాష్ట్ర బంద్‌కు తమసంపూర్ణ మద్దతు తె లియజేస్తున్నామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్ పే ర్కొన్నారు.
మంచిర్యాల కలెక్టరేట్, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి) : బీసీ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో నేడు జరగబోయే రాష్ట్ర బంద్‌కు తమసంపూర్ణ మద్దతు తె లియజేస్తున్నామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్ పే ర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాయలంలో విలేకరుల సమా వేశంలో ఆయన మాట్లడుతూ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ముం దు కామారెడ్డిలో ఇచ్చిన బీసీ డిక్లరేషన్ హామీలో భాగంగా తప్పుల తడకగా సర్వే చేసి బీసీలకు అన్యాయం చేసిందన్నారు. బీసీలకు నిజమైన రిజర్వేషన్ లు ఇచ్చి ఆదుకోవాలనే సోయి ఈ ప్రభుత్వానికి లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రెడ్డి జాగృతికి చెందిన వ్యక్తి ప్రభుత్వం జీవో విడుదల చేసిన తర్వాత కోర్టుకు వెళ్లి ఎన్నికలను ఆపడం వెనక రేవం త్‌రెడ్డి కుట్ర ఉందన్నారు. బంద్‌కు అన్ని వర్గాల ప్రజలు సహకరించా లన్నారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్, నాయకు లు కృష్ణ మూర్తి, రమేష్, మల్లికార్జున్, ముకేష్‌గౌడ్, రాకేష్, వెంకన్న, రాజ్‌కు మార్, రమేష్,చక్రవర్తి, వెంకటేశ్వర్లు, చిరంజీవి, నరేదర్ పాల్గొన్నారు.
ఫశనివారం రాష్ట్ర బంద్‌లో భాగంగా ఆర్టీసీ బందుకు సహకరించాలని కోరు తూ శుక్రవారం ఆర్టీసీ ఉద్యోగులు మంచిర్యాల ఆర్టీసీ డిప్యూటి మేనే జర్‌కు రిప్రజెంటేషన్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు.