పోలీస్ శాఖకు సంపూర్ణ సహకారం
ABN , Publish Date - Mar 16 , 2025 | 12:22 AM
పోలీ్‌సశాఖను మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రభుతం పూర్తి సహకారం అందిస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. జిల్లా పోలీ్‌సశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన స్పోర్ట్స్ మీట్ శనివారం ముగిసింది. ఈ పోటీల్లో గెలుపొందిన జట్లకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బహుమతులు అందజేశారు.

గంజాయి నిర్మూలనలో కఠినంగా వ్యవహరించాలి
మత సామరస్యంలో జిల్లా రోల్‌మోడల్‌గా నిలవాలి
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
నల్లగొండ క్రైం, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): పోలీ్‌సశాఖను మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రభుతం పూర్తి సహకారం అందిస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. జిల్లా పోలీ్‌సశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన స్పోర్ట్స్ మీట్ శనివారం ముగిసింది. ఈ పోటీల్లో గెలుపొందిన జట్లకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోలీ్‌సశాఖ అంటేనే క్రమశిక్షణ తో పాటు ఫిజికల్ ఫిట్‌నె్‌సకు మారుపేరన్నారు. ఫిజిక ల్ ఫిట్‌నె్‌సకు క్రీడలు ఎంతో దోహదపడతాయని, క్రీడ లు జీవితంలో భాగం కావాలన్నారు. జిల్లాలో మాదక ద్రవ్యాల నిర్మూలను పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరించాలన్నారు. ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి అక్రమ రవాణా జరగకుండా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. గంజాయి, మాదక ద్రవ్యాలకు అలవాటు పడి ఎంతో మంది యువత, విద్యార్థులు వారి బంగారు జీవితాల ను నాశనం చేసుకుంటున్నారని, అలాంటి వారిని సక్ర మ మార్గంలో పెట్టి జిల్లాను గంజాయి రహితంగా తీర్చిదిద్దాలన్నారు. పోలీ్‌సశాఖలో పనిచేస్తూ జాతీయ స్థాయిలో క్రీడాంశాల్లో ప్రాతినిధ్యం వహించే పోలీస్ క్రీడాకారులకు ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా సహకారం అందిస్తామన్నారు. రాష్ట్రంలోనే మొట్టమొదటి సారిగా వృద్ధులకు సైతం కలెక్టర్ గ్రీవెన్స్‌డే నిర్వహించి వారి ఇబ్బందులు తెలుసుకొని సమస్యల పరిష్కారానికి కృషి చేయడం అభినందనీయమన్నారు. పేద, మధ్య తరగతి ప్రజలకు ఆపద సమయంలో ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా నిరంతరం అండగా ఉంటున్నామన్నారు. ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా జిల్లా పోలీస్ కార్యాలయంలోని డార్మెటరీ హాల్ మరమ్మతులు చేయిస్తున్నామన్నారు. తన నిధులు, ప్రభుత్వ సహకారంతో పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో సీసీ రోడ్ల నిర్మాణంతో పాటు డీఎస్పీ కార్యాలయం, ఇత ర నూతన భవనాలను నిర్మిస్తున్నామన్నారు. ప్రభు త్వం నుంచి పోలీ్‌సశాఖకు ఏం కావాలన్నా తన వంతు గా కృషి చేస్తానన్నారు. అదే విధంగా నల్లగొండ జిల్లా అంటేనే మత సామరస్యానికి ప్రతీక అని, రానున్న రం జాన్, ఇతర పండుగల నేపథ్యంలో అంతా సోదరభావంతో మెలిగాలన్నారు. కలిసి మెలిసి పండగలను శాం తియుతగా నిర్వహించుకోవాలని సూచించారు.25 ఏళ్లు గా జిల్లా కేంద్రంలో ఎలాంటి మత ఘర్షణలు లేకుండా సోదరభావంతో మెలిగామని, రానున్న రోజుల్లో కూడా ఇలాగే ఉంటూ జిల్లా రోల్‌మోడల్‌గా నిలవాలన్నారు.
కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, క్రీడల్లో గెలుపోటములు సహజమన్నారు. యూనిఫామ్ సర్వీస్ కాబట్టి స్పోర్ట్స్ చాలా అవసరమన్నారు. మూడు రోజుల పాటు స్పోర్ట్స్ మీట్ ఉత్సాహంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ, నిత్యం విధి నిర్వహణలో బిజీగా ఉంటూ ఒత్తిడితో ఉండే పోలీస్ అధికారులు, సిబ్బందికి ఇలాంటి స్పోర్ట్స్ మీట్ ఎంతో ఉపశమనాన్ని ఇస్తాయన్నారు. ఈ ఆలోచనతో హెడ్ క్వార్టర్స్‌లో ఎనిమిదేళ్ల తర్వాత స్పోర్ట్స్ మీట్ నిర్వహించామన్నారు. జిల్లాకు చెందిన క్రీడాకారులు స్టేట్ పోలీస్ మీట్‌లో బంగారు పతకాలు సైతం సాధించారని, ఉమెన్స్ విభాగంలో సెకండ్ ప్లేస్‌లో నిలవడం సంతోషకరమన్నారు. పోలీస్ అధికారులు, సిబ్బంది ఫిట్‌నె్‌సపై దృష్టిపెట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. కబడ్డి, వాలీబాల్, క్రికెట్, ఫుట్‌బాల్, టగ్‌ఆ్‌ఫవార్ క్రీడాంశాల్లో ఏఆర్ నల్లగొండ జట్టు ప్రథమ స్థానంలో నిలవగా, నల్లగొండ సబ్ డివిజన్ జట్టు ద్వితీయ స్థానంలో నిలిచింది. కార్యక్ర మంలో డీఎస్పీలు కొలను శివరాంరెడ్డి, రాజశేఖరరాజు, రమేష్, ఆర్‌ఐలు శ్రీనివాస్, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.