Freezing Temperatures: గజ గజే..!
ABN , Publish Date - Dec 27 , 2025 | 04:28 AM
ఆదిలాబాద్ జిల్లాలో కొద్ది రోజులుగా చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణంగా ఉన్నా....
గిన్నెధరిలో 7.3, కోహీర్‌లో 7.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగతలు నమోదు
ఆదిలాబాద్ అర్బన్, ఆసిఫాబాద్, కోహీర్, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి) : ఆదిలాబాద్ జిల్లాలో కొద్ది రోజులుగా చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణంగా ఉన్నా.. రాత్రి, ఉదయం వేళల్లో చలి పులి పంజా విసురుతోంది. శుక్రవారం జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 28.3 డిగ్రీలు నమోదు కాగా కనిష్ఠంగా 7.2 డిగ్రీలకు పడిపోవడంతో ప్రజలు వణికిపోతున్నారు. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం గిన్నెధరిలో శుక్రవారం 7.3 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. సిర్పూర్(యు) మండలంలో 7.9, కెరమెరిలో 9.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉమ్మడి మెదక్ జిల్లాను గడ్డకట్టే చలి వణికిస్తోంది. శుక్రవారం ఉదయం సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో అత్యల్పంగా 7.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఇదే జిల్లాలోని ఝరాసంఘం 8.9, అల్గోల్ 9.3 డిగ్రీలు రికార్డయింది.