Buddhavarapu Venkataratnam: స్వాతంత్య్ర సమరయోధుడు బుద్ధవరపు వెంకటరత్నం కన్నుమూత
ABN , Publish Date - Nov 11 , 2025 | 03:05 AM
జాగృతి పత్రిక తొలి సంపాదకుడు, ఆర్‌ఎ్‌సఎ్‌సలో చురుకైన కార్యకర్త, క్విట్ ఇండియా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న బుద్ధవరపు వెంకటరత్నం....
క్విట్ ఇండియా ఉద్యమంలో చురుకైన పాత్ర
జాగృతి తొలి సంపాదకుడిగా సేవలు
హైదరాబాద్ సిటీ, నవంబరు10(ఆంధ్రజ్యోతి): జాగృతి పత్రిక తొలి సంపాదకుడు, ఆర్‌ఎ్‌సఎ్‌సలో చురుకైన కార్యకర్త, క్విట్ ఇండియా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న బుద్ధవరపు వెంకటరత్నం(100) ఇకలేరు. హైదరాబాద్ అల్కాపురిలోని స్వగృహంలో ఆదివారం తుదిశ్వాస విడిచారు. వారం కిందట శతవసంతాల వేడుకను కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా చేసుకున్నారు. ఆయన స్వస్థలం కాకినాడ జిల్లా గండేపల్లి మండలంలోని ఎర్రమిల్లి గ్రామం. కాకినాడలోని పిఠాపురం మహారాజా కళాశాలలో విద్య అభ్యసించారు. ఆ విద్యాలయంలో బ్రహ్మర్షి రఘుపతి వెంకటరత్నం నాయుడు బోధనలను ప్రత్యక్షంగా విన్న అరుదైన అనుభవం వెంకటరత్నం సొంతం. ఆంధ్రజ్యోతి మాజీ ఎడిటర్ నండూరి రామ్మోహన్‌రావుకు రాజమండ్రి ప్రభుత్వ కళాశాలలో సహాధ్యాయి కూడా. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. గోల్వాల్కర్ ప్రేరణతో 1940వ దశకంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌లో చేరారు. శండిల కలంతో నవలలు, కథలు రాశారు. జాగృతి పత్రిక వ్యవస్థాపక సంపాదకుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. అల్కాపురి కాలనీలోని శ్మశానవాటికలో ఆదివారం సాయంత్రం వెంకటరత్నం అంత్యక్రియలు ముగిసినట్లు ఆయన కుమారుడు శ్రీనివాసరావు తెలిపారు.