Petlaburj Government Hospital: పేట్లబురుజు ప్రభుత్వాసుపత్రిలో సంతాన సాఫల్య సేవలు
ABN , Publish Date - Sep 13 , 2025 | 05:23 AM
సంతానం లేని దంపతులకు పేట్లబురుజు ప్రభుత్వాసుపత్రి వరప్రదాయని అని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ టి. జయ పేర్కొన్నారు....
ఆస్పత్రి సూపరింటెండెంట్ టి. జయ
చార్మినార్, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): సంతానం లేని దంపతులకు పేట్లబురుజు ప్రభుత్వాసుపత్రి వరప్రదాయని అని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ టి. జయ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను శుక్రవారం ఆమె ’ఆంధ్రజ్యోతి’కి వివరించారు. సంతానం లేని దంపతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రుల్లో సంతాన సాఫల్య కేంద్రాలు ఏర్పాటు చేసిందని, ఏప్రిల్ నుంచి పేట్లబురుజు ఆసుపత్రిలో ఈ సేవలు ప్రారంభించామని తెలిపారు. తమ ఐవీఎఫ్ సెంటర్‌కు 2,800 మంది పేర్లు నమోదు చేసుకోగా, వారిలో 98 మంది మహిళలకు చికిత్స విజయవంతమైందని చెప్పారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉండకపోవచ్చని, అలాంటివారు పైసా ఖర్చు లేకుండానే ప్రభుత్వాసుపత్రుల్లో సంతాన సౌఫల్య కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూపరింటెండెంట్ టి. జయ అన్నారు.