Share News

Free Digital Booklet: జేఈఈ విద్యార్థులకు ఉచితంగా డిజిటల్‌ బుక్‌లెట్‌

ABN , Publish Date - Oct 14 , 2025 | 02:39 AM

జేఈఈ-2026కు సిద్ధమవుతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రుల అవగాహన కోసం ఐఐటీల్లో కటాఫ్‌ మార్కులు, ర్యాంకులు, సీట్ల భర్తీ, విశ్లేషణకు సంబంధించిన...

Free Digital Booklet: జేఈఈ విద్యార్థులకు ఉచితంగా డిజిటల్‌  బుక్‌లెట్‌

హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): జేఈఈ-2026కు సిద్ధమవుతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రుల అవగాహన కోసం ఐఐటీల్లో కటాఫ్‌ మార్కులు, ర్యాంకులు, సీట్ల భర్తీ, విశ్లేషణకు సంబంధించిన డిజిటల్‌ బుక్‌లెట్‌ను ఉచితంగా అందిస్తున్నట్లు ఐఐటీ-జేఈఈ/నీట్‌ ఫోరం తెలిపింది. 146 పేజీల బుక్‌లెట్‌లో ఐఐటీ-జేఈఈ 2025 ర్యాంకులు, దేశవ్యాప్తంగా ఐఐటీల్లో సీట్ల కేటాయింపు, కటాఫ్‌ మార్కులు, రిజర్వేషన్ల వారీగా ఓపెనింగ్‌, క్లోజింగ్‌ ర్యాంకుల విశ్లేషణ, ఐఐటీల్లో కోర్సుల సమాచారాన్ని పొందుపరిచినట్లు వెల్లడించింది. పుస్తకం వెబ్‌వెర్షన్‌లో అందుబాటులో ఉందని, కావాల్సిన వారు వాట్సప్‌ నంబర్‌ 9849016661కు మెసేజ్‌ చేయాలని పేర్కొంది.

Updated Date - Oct 14 , 2025 | 02:39 AM