Share News

డబ్బులు డ్రా చేస్తానని మోసం

ABN , Publish Date - Jun 19 , 2025 | 12:25 AM

డబ్బులు డ్రా చేసేందుకు సహకరిస్తున్నట్లు నటించి ఏటీఎంకార్డులతో పరారవుతున్న అంతర్రాష్ట్ర దొంగను సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ పోలీసులు బుధవారం అరె్‌స్ట చేశారు.

డబ్బులు డ్రా చేస్తానని మోసం
వివరాలు వెల్లడిస్తున్న సీఐ చరమందరాజు

అంతర్రాష్ట్ర దొంగను పట్టుకున్న పోలీసులు

హుజూర్‌నగర్‌, జూన్‌ 18(ఆంధ్రజ్యోతి): డబ్బులు డ్రా చేసేందుకు సహకరిస్తున్నట్లు నటించి ఏటీఎంకార్డులతో పరారవుతున్న అంతర్రాష్ట్ర దొంగను సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ పోలీసులు బుధవారం అరె్‌స్ట చేశారు. హుజూర్‌నగర్‌లోని సర్కిల్‌ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సీఐ చరమందరాజు కేసు వివరాలు వెల్లడించారు. గత సంవత్సరం నవంబరు 14వ తేదీన హుజూర్‌నగర్‌లోని యూనియన్‌ బ్యాంక్‌ వద్ద ఏటీఎంలో డబ్బులు తీసేందుకు పట్టణానికి చెందిన మంద విజయకరుణ వచ్చారు. అదే సమయంలో ఏపీలోని విజయవాడ నగరానికి చెందిన కృష్ణలంక ప్రాంతానికి చెందిన ట్రాక్టర్‌ మెకానిక్‌ చింతల సురేష్‌ అక్కడికి రావడంతో ఏటీఎం నుంచి డబ్బులు తీసేందుకు సహకరించాలని కోరింది. అతను ఆమె చెప్పిన పిన్‌ నెంబర్‌ను ఉపయోగించి డబ్బు డ్రాచేసి డబ్బులతో పాటు నకిలీ ఏటీఎం ఇచ్చి ఒరిజినల్‌ ఏటీఎంకార్డు తీసుకెళ్లాడు. అనంతరం వేరే ప్రదేశాల్లో ఏటీఎం కార్డుతో రూ.లక్షా 25వేల నగదు డ్రా చేశాడు. దీంతో బాధితురాలు హుజూర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్న సమయంలో సురేష్‌ బుధవారం మధ్యాహ్నం హుజూర్‌నగర్‌లోని హెడ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌ సమీపంలో అనుమానాస్పదంగా కన్పించడంతో పోలీసులు అరెస్టు చేశారు. అతనిని విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. సురేష్‌ ఏపీ, తెలంగాణ ప్రాంతాల్లో 44 కేసుల్లో అమాయకులను మోసగించి డబ్బులు కాజేసినట్లు సీఐ తెలిపారు. నిందితుడి వద్ద రూ.లక్ష నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసును చేధించిన ఎఎ్‌సఐ బలరాంరెడ్డి, పోలీసులు వరప్రసాద్‌, నాగరాజులను సీఐ చరమందరాజు అభినందించారు.

Updated Date - Jun 19 , 2025 | 12:25 AM