Share News

కోర్టులో ఉద్యోగాల పేరుతో మోసం

ABN , Publish Date - May 14 , 2025 | 12:14 AM

కోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగుల నుంచి రూ.10.32లక్షలు వసూలు చేసిన ఇ ద్దరిని తిప్పర్తి పోలీసులు అరెస్ట్‌ చేశారు.

 కోర్టులో ఉద్యోగాల పేరుతో మోసం
సమావేశంలో వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ శివరాంరెడ్డి

కోర్టులో ఉద్యోగాల పేరుతో మోసం

3 నెలలుగా రూ.10.32 లక్షలు వసూలు

మహిళా న్యాయవాది, గుమాస్తాను అరెస్ట్‌ చేసిన పోలీసులు

తిప్పర్తి, మే 13(ఆంధ్రజ్యోతి): కోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగుల నుంచి రూ.10.32లక్షలు వసూలు చేసిన ఇ ద్దరిని తిప్పర్తి పోలీసులు అరెస్ట్‌ చేశారు. మంగళవారం తిప్ప ర్తి పోలీ్‌సస్టేషనలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ శివరాంరెడ్డి ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. నల్లగొండ పట్టణానికి చెందిన ఎండీ నసీర్‌ నల్లగొండ కోర్టులో విధులు నిర్వహిస్తున్న న్యాయవాదులకు గుమస్తాగా పనిచేస్తూనే, పలు కేసులపై ఆర్టీఐ దరఖాస్తులు దాఖ లు చేసేవాడు. నల్లగొండకు చెందిన జ్యోతిరాణి జూనియర్‌ అడ్వకేట్‌గా పనిచేస్తుండగా, ఇద్దరికీ కోర్టులో పరిచయమైంది. ఈ క్రమంలో ఇరువురు కలిసి వివిధ రకాల సమస్యలు, కోర్టు లో కేసుల నిమిత్తం వచ్చే నిరుద్యోగ, యువతీ, యువకులతో మాట్లాడుతూ వారికి కోర్టులో స్వీపర్‌, అటెండర్‌ ఉద్యోగాలు ఇ ప్పిస్తామని నమ్మబలికారు. నల్లగొండ, తిప్పర్తి, మాడ్గులపల్లి మండలాల పరిధిలోని 31మంది నిరుద్యోగుల నుంచి ఒక్కొక్కరి నుంచి రూ. 20వేల నుంచి రూ.50వేల చొప్పున మొత్తం గత మూడు నెలలుగా రూ.10.32లక్షలు వసూలు చేశారు. ఉద్యోగం గురించి అడిగినప్పుడల్లా మాట దాటవేస్తున్నారు. తిప్పర్తి మం డల పరిధిలోని ఇండ్లూరుకు చెందిన బాధితురాలు ఏపూరి హె ప్సిబా ఈ నెల 7వ తేదీన ఫిర్యాదు చేయటంతో వారిద్దరిని అ దుపులోకి తీసుకుని విచారించగా, నేరం అంగీకరించారు. నసీర్‌, జ్యోతిరాణిపై తిప్పర్తి, మాడ్గులపల్లి, నల్లగొండ వనటౌన పోలీ్‌సస్టేషనలో 7 కేసులు నమోదయ్యాయని, వారినుంచి రూ.10వేల నగదు, ద్విచక్ర వాహనం, 2 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ శివరాంరెడ్డి తెలిపారు. నిరుద్యోగులు ఎవరూ హామీలను నమ్మి మోసపోవద్దని సూచించారు. ప్రస్తుతం ప్రతీ ఉద్యోగానికి పత్రికా ప్రకటనతో పాటుగా రాత పరీక్ష ఉంటుందన్నారు. సమావేశంలో సీఐ కె.కొండల్‌రెడ్డి, ఎస్‌ఐ బి.సాయిప్రశాంత, స్టేషన సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 14 , 2025 | 12:14 AM