Best Teachers: జాతీయ ఉత్తమ అధ్యాపకులుగా నలుగురు తెలుగువాళ్లు
ABN , Publish Date - Aug 27 , 2025 | 02:26 AM
తెలుగు రాష్ట్రాల్లోని ఉన్నత విద్యాసంస్థలు, పాలిటెక్నిక్ కళాశాలల్లో పని చేస్తున్న నలుగురు లెక్చరర్లు...
న్యూఢిల్లీ, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాల్లోని ఉన్నత విద్యాసంస్థలు, పాలిటెక్నిక్ కళాశాలల్లో పని చేస్తున్న నలుగురు లెక్చరర్లు, ప్రొఫెసర్లు జాతీయ ఉత్తమ అధ్యాపకులుగా ఎంపికయ్యారు. 2025కు గానూ కేంద్ర విద్య మంత్రిత్వ శాఖ.. దేశవ్యాప్తంగా 21 మంది లెక్చరర్లు, ప్రొఫెసర్లను జాతీయ ఉత్తమ అధ్యాపకులుగా మంగళవారం ఎంపిక చేసింది. ఇందులో ఏపీ నుంచి ప్రొఫెసర్ జె. విజయలక్ష్మి (స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, విజయవాడ), డాక్టర్ మెండా దేవానంద కుమార్ (డాక్టర్ లాకిరెడ్డి హన్మిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కాలేజ్, మైలావరం), తెలంగాణ నుంచి ప్రొఫెసర్ సాంకేత్ గోయల్ (బిట్స్‌పిలాని, హైదరాబాద్), ప్రొఫెసర్ వినీత్ ఎన్‌బీ (ఐఐటీ హైదరాబాద్)లు ఉన్నారు.