Former Vice President Venkaiah Naidu: దేశ రాజకీయాల్లో అద్వానీ శిఖర సమానుడు
ABN , Publish Date - Nov 09 , 2025 | 02:29 AM
మాజీ ఉపప్రధాని ఎల్‌కే అద్వానీ భారతదేశ రాజకీయాల్లో శిఖర సమానుడని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చెప్పారు. వ్యక్తిగతంగా అద్వానీ తనకు పితృసమానులన్నారు...
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యాఖ్య
న్యూఢిల్లీ, నవంబరు 8(ఆంధ్రజ్యోతి): మాజీ ఉపప్రధాని ఎల్‌కే అద్వానీ భారతదేశ రాజకీయాల్లో శిఖర సమానుడని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చెప్పారు. వ్యక్తిగతంగా అద్వానీ తనకు పితృసమానులన్నారు. అద్వానీ దేశభక్తి, క్రమశిక్షణ, అంకితభావం, దృఢసంకల్పం యువతకు ఆదర్శనీయమైనవన్నారు. అద్వానీ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఇంటికి వెళ్లి వెంకయ్య శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం తన నివాసంలో మీడియా ప్రతినిధులతో ముచ్చటించారు. ప్రత్యేక ఓటర్ల జాబితా విస్తృత సవరణ నేపథ్యంలో ఎన్నికలు జరిగే రాష్ట్రాలలో రాజకీయ పార్టీలు తమ బాధ్యతగా ఓటర్ల తొలగింపు లేదా చేరికకు సంబంధించి ఓటర్ల జాబితాను సరిచూసుకోవాలని వెంకయ్య హితవు పలికారు.