Share News

Former Vice President Venkaiah Naidu: పార్టీ కార్యకర్తలతో నిరంతరం టచ్‌లో ఉండండి

ABN , Publish Date - Dec 26 , 2025 | 05:20 AM

మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడితో బీజేపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నితిన్‌ నబీన్‌ భేటీ అయ్యారు. వెంకయ్యనాయుడి నివాసంలో జరిగిన ఈ సమావేశంలో బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడి....

Former Vice President Venkaiah Naidu: పార్టీ కార్యకర్తలతో నిరంతరం టచ్‌లో ఉండండి

  • నితిన్‌ నబీన్‌కు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య సూచన

న్యూఢిల్లీ, డిసెంబరు 25(ఆంధ్రజ్యోతి): మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడితో బీజేపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నితిన్‌ నబీన్‌ భేటీ అయ్యారు. వెంకయ్యనాయుడి నివాసంలో జరిగిన ఈ సమావేశంలో బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడిగా తన అనుభవాలను, ఆలోచనలను ఆయనతో పంచుకున్నారు. దేశవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించడం, పార్టీ కార్యకర్తలతో నిరంతరం టచ్‌లో ఉండటం అవసరమని సూచించారు. మరోవైపు మాజీ ప్రధాని వాజ్‌పేయి ఆలోచనలు యువతకు స్ఫూర్తిదాయకమైనవని, నవ భారత నిర్మాణానికి ప్రేరణనందిస్తాయని చెప్పారు. వాజ్‌పేయి జయంతి సందర్భంగా ఆయన స్మారకం ’సదైవ్‌ అటల్‌’ వద్ద వెంకయ్య నివాళులు అర్పించారు. వాజ్‌పేయి చేపట్టిన సంస్కరణల స్ఫూర్తి భారత్‌ను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తుందన్నారు. కాగా, అటల్‌ స్మృతి న్యాస్‌ సొసైటీ అధ్యక్షుడిగా వెంకయ్యనాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Updated Date - Dec 26 , 2025 | 05:20 AM