Share News

కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎంపీటీసీ దంపతులు

ABN , Publish Date - Dec 07 , 2025 | 11:20 PM

గ్రామ పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అమ్రాబాద్‌ మండలం మన్ననూరు గ్రామ బీఆర్‌ఎస్‌కు ఎదురుదెబ్బ తగిలింది.

కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎంపీటీసీ దంపతులు
మాజీ ఎంపీటీసీ దంపతులను కాంగ్రెస్‌ పార్టీలో చేర్చుకుంటున్న ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ

మన్ననూర్‌, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి) : గ్రామ పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అమ్రాబాద్‌ మండలం మన్ననూరు గ్రామ బీఆర్‌ఎస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. మాజీ ఎంపీటీసీ సభ్యురాలు కప్పెర వెంకటమ్మ, ఆమె భర్త బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు కప్పెర నిరంజన్‌లతో పాటుగా పలువురు అనుచరులు ఆదివారం సాయంత్రం అచ్చంపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారిని ఎమ్మెల్యే కాంగ్రెస్‌ కండు వాలు కప్పి సారదంగా ఆహ్వానించారు. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తానని ఎమ్మెల్యే వారికి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ కోఆఫ్షన్‌ సభ్యుడు రహీం, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు జూలూరి సత్యనారాయణ, పెర్ముల వెంకటేశ్వ ర్లు, గోపాల్‌, కుమార, రహిమాన్‌, శివాజి, వెంక టయ్య మేరాజ్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 07 , 2025 | 11:20 PM