Share News

kumaram bheem asifabad- అటవీ సంపదను కాపాడాలి

ABN , Publish Date - Aug 03 , 2025 | 10:47 PM

అటవీ సంపదను కాపాడడం అందరి బాధ్యత అని సీసీఎఫ్‌ శాంతారాం అన్నారు. మండలంలోని దిందా, బండెపల్లి అటవీ ప్రాంతంలో తవ్వుతున్న కందకాలను జిల్లా అటవీ అధికారులు, సిబ్బందితో కలిసి పరిశీలించారు.

kumaram bheem asifabad- అటవీ సంపదను కాపాడాలి
కందకాలను పరిశీలిస్తున్న సీసీఎఫ్‌ శాంతారాం

చింతలమానేపల్లి, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): అటవీ సంపదను కాపాడడం అందరి బాధ్యత అని సీసీఎఫ్‌ శాంతారాం అన్నారు. మండలంలోని దిందా, బండెపల్లి అటవీ ప్రాంతంలో తవ్వుతున్న కందకాలను జిల్లా అటవీ అధికారులు, సిబ్బందితో కలిసి పరిశీలించారు. ఇక్కడి ప్రాంతంలో భూములను రైతులు పోడు వ్యవసాయం చేసుకొని జీవనం సాగిస్తుండగా అటవీ శాఖ ఆధ్వర్యంలో ఈ ఏడాది భూ సేకరణ జరుగుతుంది. ఇందులో భాగంగానే అటవీ అధికారులు అటవీ భూ విస్తీర్ణాన్ని సేకరించేందుకు కందకాలు తవ్వుతున్నారు. ఇక్కడి పరిస్థితిని, అటవీ సంపదను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం సిబ్బందికి పలు సలహాలు, సూచనలు చేశారు. ఆయన వెంట జిల్లా అటవీ అధికారి నీరజ్‌కుమార్‌ టిబ్రెవాల్‌, కాగజ్‌నగర్‌ ఎఫ్‌డీఓ సుశాంత్‌ బోబాడే, కర్జెల్లి రేంజ్‌ అధికారి సుభాష్‌, కౌటాల సీఐ సంతోష్‌కుమార్‌, చింతలమానేపల్లి ఎస్సై నరేష్‌, ఎఫ్‌ఎస్‌ఓలు, ఎఫ్‌బీఓలు ఉన్నారు.

సిర్పూర్‌(టి), ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): సిర్పూర్‌(టి) మండలంలోని ఇటిక్యాలపహాడ్‌ గ్రామాన్ని ఆదివారం పీసీసీఎఫ్‌ శాంతారాం సందర్శించారు. గ్రామంలో రిజర్వు ఫారెస్టు భూముల విస్తీర్ణంపై ఇన్‌చార్జి ఎఫ్‌ఆర్వోను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ మొక్కలు నాటాలన్నారు. రానున్న రోజుల్లో ఇటిక్యాల పహాడ్‌ అటవీ ప్రాంతం వన్యప్రాణులకు రక్షణగా ఉంటుందన్నారు. ఆయన వెంట అటవీ శాఖాధికారులు తదితరులు ఉన్నారు.

Updated Date - Aug 03 , 2025 | 10:47 PM