Share News

kumaram bheem asifabad- అటవీ.. అడ్డంకి

ABN , Publish Date - Nov 22 , 2025 | 10:39 PM

జిల్లా లోని మారుమూల ప్రాంతాల్లో చేపట్టిన రోడ్డు పనులకు అటవీశాఖ అనుమతులు అడ్డంకిగా మారాయి. దీంతో రోడ్లు, వంతెనలు లేక ఎన్నో ఏళ్లు గా అభివృద్ధికి దూరంగా ఉంటున్నారు. గతంలో ఆయా గ్రామాల్లో వంతెనలు, రోడ్ల నిర్మాణాలకు ప్రభుత్వం నిఽధులు మంజూరు చేసినా పనులు చేపట్టలేదు. రోడ్ల నిర్మాణాలతో అడవులు అంత రించి పోతాయని అభివృద్ధి పనులకు అటవీ శాఖ కొర్రీలు పెట్టింది. గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యం మెరుగు పర్చడానికి ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్నా అటవీ శాఖ అను మతులు లేక ఒక్క అడుగు ముందుకు కదలడం లేదు.

kumaram bheem asifabad- అటవీ.. అడ్డంకి
అటవీ అనుమతులు లేక ఆగిపోయిన మొగవెల్లి-గూడెం రోడ్డు

- ఒర్రెలు, వాగులపై వంతెనలు, రోడ్లు లేక ప్రజల అవస్థలు

- దశాబ్దాలుగా తప్పని ఇబ్బందులు

- అభివృద్ధికి నోచుకోని మారుమూల ప్రాంతాలు

బెజ్జూరు, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): జిల్లా లోని మారుమూల ప్రాంతాల్లో చేపట్టిన రోడ్డు పనులకు అటవీశాఖ అనుమతులు అడ్డంకిగా మారాయి. దీంతో రోడ్లు, వంతెనలు లేక ఎన్నో ఏళ్లు గా అభివృద్ధికి దూరంగా ఉంటున్నారు. గతంలో ఆయా గ్రామాల్లో వంతెనలు, రోడ్ల నిర్మాణాలకు ప్రభుత్వం నిఽధులు మంజూరు చేసినా పనులు చేపట్టలేదు. రోడ్ల నిర్మాణాలతో అడవులు అంత రించి పోతాయని అభివృద్ధి పనులకు అటవీ శాఖ కొర్రీలు పెట్టింది. గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యం మెరుగు పర్చడానికి ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్నా అటవీ శాఖ అను మతులు లేక ఒక్క అడుగు ముందుకు కదలడం లేదు. వర్షాకా లంలో గిరిజనులు పడుతున్న కష్టాలు వర్ణనాతీ తంగా ఉన్నాయి. అనుమతుల కోసం ప్రతిపాద నలు పంపుతున్నా పరిస్థితుల్లో మార్పు లేదు.

- మారుమూల ప్రాంతాలకు..

జిల్లాలోని బెజ్జూరు, పెంచికలపేట, దహెగాం, సిర్పూర్‌(టి), వాంకిడి, తిర్యాణి తదితర మండ లాల్లో మారుమూల గ్రామాలకు రహదారులు, ఒర్రెలపై వంతెనల నిర్మాణాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. కాగా అటవీ శాఖ అనుమతులు లేక అభివృద్ధి పనులు నిలిచిపో యాయి. వర్షాకాలంలో భారీ వర్షాలు కురిస్తే కల్వర్టులు ఉప్పొంగి ప్రవహిస్తే రాకపోకలు నిలిచి పోతున్నాయి. దీంతో జిల్లాలోని పలు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రహదా రులు, వంతెనలు లేక ఆయా గ్రామాలకు క,నీసం అంబులెన్స్‌ సైతం వెళ్లలేని పరిస్థితి నెలకొంది.

- దిందా వాగుపై..

చింతలమానేపల్లి మండలంలోని దిందా వాగుపై వంతెన నిర్మాణానికి 2017లో ప్రభుత్వం రూ.3 కోట్లు మంజూరు చేసింది. అనుమతులు లేక వంతెన పనులు ప్రారంభం కాలేదు. ఇటీవల వాగుపై వంతెన నిర్మాణానికి అటవీ అనుమతులు వచ్చాయని చెబుతున్నా ఇప్పటికి పనులు చేపట్టలేదు. బెజ్జూరు మండలంలోని పాపన్‌పేట నుంచి పెంచికలపేట మండలంలోని కమ్మర్‌గాం మీదుగా మొర్లిగూడ వరకు రోడ్డు నిర్మాణాలకు రూ.36కోట్లు మంజూరు చేయగా, టెండర్లు సైతం పూర్తి కాగా అటవీ అనుమతులు లేవన్న కారణం తో పనులు చేపట్టలేదు. దహెగాం మండలంలోని మొట్లగూడ-ఖర్జీ గ్రామానికి అప్పటి ప్రభుత్వ హయాంలో నిధులు మంజూరు చేసింది. దీనికి కూడా అనుమతులు లేక రోడ్లు పనులు ఆగిపో యాయి. అలాగే బెజ్జూరు మండలంలోని సోమి ని-తలాయి మీదుగా మొర్లిగూడకు రూ.18కోట్లు, దహెగాం మండలంలోని పార్వతిపేట-చిన్నగుడిపే ట మధ్య కొంతమేర బీటి పనులు చేపట్టగా అనుమతులు లేక అర్దంతరంగా నిలిచింది. వాంకిడి మండలం నుంచి కాగజ్‌నగర్‌ మండలంలోని మాలిని మీదుగా సిర్పూర్‌(టి) వరకు నిధులు మంజూరు చేయగా అటవీ అనుమతుల కారణం గా పనులు నిలిచిపోయాయి. తిర్యాణి మండలం లోని మాణిక్యాపూర్‌-మంగి రహదారి నిర్మాణానికి సింగరేణి యాజమాన్యం భూనిర్వాసితుల కోసం రహదారుల అభివృద్ధి కోసం నిధులు కేటాయిం చగా, మూడు కిలమీటర్ల రోడ్డు నిర్మాణం పూర్తికా గా మిగితా పనులు నిలిచిపోయాయి. తిర్యాణి మండలం రొంపల్లి-గుండాల రోడ్డు నిర్మాణానికి 2011లో రూ.5కోట్లను మంజూరు చేయగా, ఐటీడీఏ ఆద్వర్యంలో ఈ పనులు చేపట్టగా వంతెన పనులు పూర్తికాగా అటవీ ప్రాంతంలో అనుమతులు లేవన్న కారణంతో పనులు నిలిపి వేశారు.

- పీఎంజీఎస్‌వై కింద..

బెజ్జూరు మండలంలోని మొగవెల్లి-గూడెం గ్రా మాల మద్య రోడ్డు నిర్మాణానికి 2014లో పీఎం జీఎస్‌వై పథకంలో రూ.6.65కోట్లు మంజూరు చేశారు. ఈ నిధులతో ఇప్పటికి రెండు వంతెనలు, ఏడు కల్వర్టులు పూర్తి చేశారు. అప్పట్లో రోడ్డు నిర్మా ణం కోసం కంకర వేశారు. అనుమతులు లేవన్న కారణంతో అటవీ అధికారులు పనులను అడ్డుకు న్నారు. దీంతో అప్పట్లో కంకర వేసిన రోడ్డుపైనే రాకపోకలు కొనసాగిస్తున్నారు. అదే విదంగా సుశ్మీర్‌-కుశ్నపల్లి గ్రామాల మద్య రెండు ఒర్రెలపై వంతెనల నిర్మాణాలకు రెండు వంతెనల నిర్మాణం కోసం రూ.4.25మంజూరు చేసింది. పనులను ప్రారంభ దశలోనే అటవీ అధికారులు అడ్డుపడ్డారు. దీంతో పనులు ముందుకు సాగడం లేదు. ఎన్నో ఏళ్లుగా అభివృద్ధి పనులు ముందుకు సాగకపోవ డంతో ఆయా గ్రామాల ప్రజలు నిత్యం అష్టకష్టాలు పడుతున్నారు. సలుగుపల్లి-పెంచికలపే గ్రామాల మద్య రహదారి నిర్మాణానికి రూ.10కోట్లు మంజూ రు చేయగా ఇది పూర్తిగా అటవీ ప్రాంతంలో ఉండటంతో పనులు చేపట్టలేదు. ఈ మార్గంలో కేవలం 15కి.మీ.దూరం ఉన్నా ప్రయాణానికి గంటకు పైగా పడుతోంది.

- వచ్చిన నిధులు వెనక్కి..

జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిధులు మంజూరు చేయగా కాంగ్రెస్‌ అధికారంలో వచ్చిన తర్వాత రోడ్లు, వంతెనలు చేపట్టని కారణంగా వచ్చిన నిధులను వెనక్కి మల్లించాయి. దీంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. గ్రామాలకు రోడ్లు, వంతెనల కోసం నిధులు మంజూరు అయ్యాయని ప్రజలు సంతోష పడ్డా పనులు చేయని కారణంగా ఇక్కట్లు తప్పడం లేదని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు పనులు చేయక, మరోవైపు అటవీ అనుమతులు రాక ఎన్నో దశాబ్దాలుగా బాహ్యప్రపంచానికి దూరంగా ఉండాల్సిన పరిస్థితు లు నెలకొన్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందిం చి రోడ్లు, వంతెనల నిర్మాణాలకు చర్యలు తీసుకో వాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.

ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు..

- పాల్వాయి హరీష్‌బాబు, సిర్పూర్‌ ఎమ్మెల్యే

మారుమూల గ్రామాల ప్రజలు ఎన్నో ఏళ్లుగా రోడ్లు లేక పోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. గర్భిణులు, బాలింతలు, రోగులు వైద్యం కోసం వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నారు. అటవీ గ్రామాల్లో రోడ్లకు స్టేజ్‌-2లో ఇబ్బందులు తలెత్తుతు న్నాయి. పరివేష్‌ పోర్టల్‌లో రోడ్లకు సంబంధించిన వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ఆయా గ్రామాల్లో రోడ్ల నిర్మాణాల్లో ఎంతమేర అటవీ ముంపుకు గురవుతుందో ఆయా శాఖలు అటవీ శాఖకు నష్టపరిహారం ఇవ్వాల్సి ఉంటుంది. రోడ్లకు సంబంధించిన నష్టపరిహారం చెల్లిస్తే అనుమతులు కోసం కృషి చేస్తాం.

Updated Date - Nov 22 , 2025 | 10:39 PM