Share News

Forest department staff caught: అటవీ శాఖ సిబ్బంది ఆటవిడుపు!

ABN , Publish Date - Sep 11 , 2025 | 06:01 AM

అది అటవీశాఖ జిల్లా కార్యాలయం.. శాఖాపరంగా పనులపై వచ్చే ప్రజలకు సేవలందించాల్సినది.. కానీ దాన్ని పేకాట...

Forest department staff caught: అటవీ శాఖ సిబ్బంది ఆటవిడుపు!

  • జిల్లా కార్యాలయంలోనే పేకాట

  • సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు, వీడియోలు వైరల్‌

లక్ష్మీదేవిపల్లి, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): అది అటవీశాఖ జిల్లా కార్యాలయం.. శాఖాపరంగా పనులపై వచ్చే ప్రజలకు సేవలందించాల్సినది.. కానీ దాన్ని పేకాట స్థావరంగా మార్చేశారు కొందరు ఆ శాఖ ఉద్యోగులు, సిబ్బంది. అటవీశాఖ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యాలయంలో చోటు చేసుకున్న ఘటన ఇది. ఆ కార్యాలయంలోని కొందరు సిబ్బంది, ఉద్యోగులు కలిసి పేకాట ఆడుతున్న వీడియోలు, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా కావడంతో ప్రజలు మండిపడుతున్నారు. వేలకు వేలు జీతాలు తీసుకుంటూ చట్టాన్ని రక్షించాల్సిన ఉద్యోగులే ఇలాంటి చర్యలకు పాల్పడటం పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. పట్టపగలే కార్యాలయంలో పేకాట ఆడటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా జిల్లా కార్యాలయాన్ని పేకాట అడ్డాగా మార్చినా ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం వెనుక ఆంతర్యమేంటని జిల్లాలో జోరుగా చర్చ సాగుతోంది. దీనిపై ఆ శాఖ ఉన్నతాధికారులను వివరణ కోరేందుకు ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదు. అయితే ఈ వ్యవహారం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడంతో పోలీసులు ఆరా తీస్తున్నట్టు తెలిసింది. ఈ ఘటనకు సంబంధించి శాఖాపరంగా ఎలాంటి చర్యలు చేపడతారో వేచి చూడాల్సిందే.

Updated Date - Sep 11 , 2025 | 06:01 AM