Bastar Tourism: నక్సల్స్ అడ్డాలో విదేశీయులు
ABN , Publish Date - Oct 08 , 2025 | 04:42 AM
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని నక్సల్స్ ప్రభావవిత ప్రాంతం బస్తర్ అడవుల పేరు వినగానే ఒకప్పుడు ప్రజలు భయపడేవారు....
నంబి జలపాతాన్ని సందర్శించిన జర్మనీ పర్యాటకులు
ఆపరేషన్ కగార్‌తో మారుతున్న బస్తర్ ముఖ చిత్రం
చర్ల, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని నక్సల్స్ ప్రభావవిత ప్రాంతం బస్తర్ అడవుల పేరు వినగానే ఒకప్పుడు ప్రజలు భయపడేవారు. కానీ, ‘ఆపరేషన్ కగార్’తో ఆ పరిస్థితి మారింది. కేంద్ర బలగాలు అడవుల్లో అంతర్గత రహదారుల నిర్మాణం చేపట్టడంతో బస్తర్ ముఖచిత్రం కొత్తదనం సంతరించుకుంది. ఎతైన గుట్టలు, లోయలు, కనువిందు చేసే జలపాతాలతో నిండిన బస్తర్ అంటేనే అందాలకు నిలయం. గతంలో రోడ్డు సౌకర్యం లేక జిల్లా కేంద్రాలకే పరిమితమైన పర్యాటకులు, ఇప్పుడు మారుమూల ప్రాంతాలకు కూడా తరలివస్తున్నారు. ఈ అభివృద్ధి నేపథ్యంలో, బీజాపూర్ జిల్లాలోని నంబి జలపాతాన్ని సందర్శించడానికి మంగళవారం ఇద్దరు జర్మనీ దేశస్థులు వచ్చారు. వారు నంబి గ్రామస్థులతో మాట్లాడారు. జలపాతం అందాలను తమ కెమెరాల్లో బంధించారు. స్థానికులతో వంట వండించుకుని భోజనం చేశారు. ఆ విదేశీ పర్యాటకులు ఇక్కడి మావోయిస్టులు, వారి జీవనశైలి, పోలీసుల మోహరింపు గురించి, అలాగే ఆదివాసీల జీవన స్థితి గతుల గురించి అడిగి తెలుసుకున్నారు.