భూ సమస్యల పరిష్కారం కోసమే..
ABN , Publish Date - Nov 01 , 2025 | 11:31 PM
భూ సమస్యల పరిష్కారం కోసమే రాష్ట్ర ప్రభు త్వం రెవెన్యూ సదస్సులను చేపట్టిందని తహసీ ల్దార్ శ్రీనివాస్ అన్నారు.
- రెవెన్యూ సదస్సుల్లో అధికారులు
పెద్దకొత్తపల్లి, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి) : భూ సమస్యల పరిష్కారం కోసమే రాష్ట్ర ప్రభు త్వం రెవెన్యూ సదస్సులను చేపట్టిందని తహసీ ల్దార్ శ్రీనివాస్ అన్నారు. మండల పరిధిలోని ఆదిరాల, వేడుకరావుపల్లి గ్రామాల్లో శనివారం జరిగిన రెవెన్యూ సదస్సుల్లో ఆయన మాట్లాడా రు. రైతులు ఇంతకు ముందు రెవెన్యూ సదస్సు లో పెట్టుకున్న అర్జీలను ఇప్పుడు క్షుణ్ణంగా పరి శీలించి అధికారులు పరిష్కరించారు. ఆదిరాలలో 12, వేడుకరావుపల్లిలో 19దరఖాస్తులను పరిష్క రించారు. కార్యక్రమంలో ఆదిరాల గ్రామ సభలో తహసీల్దార్ శ్రీనివాస్, గిర్దావర్ శివకృష్ణ, జీపీవో ఎండి.ఖాజాబాను, వేడుకరావుపల్లి గ్రామసభలో డిప్యూటీ తహసీల్దార్ రమేష్, జీపీవో కృష్ణ పాల్గొన్నారు.
ఫ కోడేరు, (ఆంధ్రజ్యోతి) : శని వారం మండల పరిధిలోని బావా యిపల్లి గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. తహసీల్దార్ విజయ్‌కు మార్ మాట్లాడుతూ రైతులు కొంత కాలంగా భూములు రికార్డులు నమో దు కాని వారు వివిధ సమస్యలతో ఉ న్న వారు రెబెండు సదస్సులో భూ మికి సంబంధించి రికార్డులు సమ ర్పించి సమస్యలు పరిష్కరించుకోవాలని ఆయ న రైతులను కోరారు. ఈ కార్యక్రమంలో రెవె న్యూ, ఆర్‌ఐ మహేష్, రైతులు పాల్గొన్నారు.
ఫ తిమ్మాజిపేట, (ఆంధ్రజ్యోతి) : మండల పరిధిలోని అప్పాజీపల్లిలో శనివారం రెవెన్యూ సదస్సు నిర్వహించారు. గత రెవెన్యూ సదస్సులో అందజేసిన భూ సమస్యల సాదాబైనామాలకు సంబంధించిన దరఖాస్తులను తహసీల్దార్ రామ కృష్ణయ్య పరిశీలించి సంబంధిత రైతులతో మా ట్లాడారు. తహసీల్దార్ రామకృష్ణయ్య మాట్లాడు తూ ఆయా గ్రామాల్లో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవా లని కోరారు. డిప్యూటీ తహసీల్దార్ జ్యోతి, రెవె న్యూ ఇన్‌స్పెక్టర్ రవిచంద్ర, సీనియర్ అధికారి శ్రీకాంత్, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.