Share News

‘స్థానికం’లో పట్టు కోసం..

ABN , Publish Date - Nov 28 , 2025 | 12:25 AM

స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ పార్టీల పునాదులను పటి ష్టం చేసుకోవడమే లక్ష్యంగా ముఖ్య నాయకులు పావు లు కదుపుతున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల రిజ ర్వేషన్లు పూర్తికావడం, గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభం కావడంతో పల్లెల్లో ఎన్నికల వాతావరణం వేడెక్కింది

‘స్థానికం’లో పట్టు కోసం..

-పంచాయతీ పోరుపై పల్లెల్లో జోరుగా మంతనాలు

-సర్పంచ్‌, వార్డు స్థానాలపై ప్రత్యేక దృష్టి

-పార్టీల గుర్తులు ఉండకపోవడంతో అభ్యర్థులపై గురి

-ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న అన్ని పార్టీలు

మంచిర్యాల, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ పార్టీల పునాదులను పటి ష్టం చేసుకోవడమే లక్ష్యంగా ముఖ్య నాయకులు పావు లు కదుపుతున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల రిజ ర్వేషన్లు పూర్తికావడం, గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభం కావడంతో పల్లెల్లో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ఇదే అదునుగా వివిధ పార్టీ లు ముఖ్య నాయకుల మంతనాలు సైతం జోరందు కున్నాయి. సర్పంచ్‌, వార్డు సభ్యుల స్థానాలకు పోటీ చే యాలనుకుంటున్న ఆశావహులు ఇప్పటికే ఏర్పా ట్లను పూర్తి చేసుకున్నారు కూడా. ముఖ్యంగా సర్పంచ్‌ పీఠం పై కన్నేసిన వారంతా జిల్లా, రాష్ట్ర నాయకులను ప్రస న్నం చేసుకునే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. పం చాయతీ ఎన్నికలు పార్టీల గుర్తులపై జరగకున్నా గ్రా మ స్థాయిలో తమ పార్టీ పునాదులను పటిష్టం చేసు కోవడం కోసం రాజకీయ పార్టీలు అభ్యర్థులను బలపరుస్తున్నాయి.

గెలుపు అవకాశాలపై మంతనాలు...

పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల ఆనుకూలత, గె లుపు అవకాశాలపై లెక్కలు వేసుకుంటూ వివిధ పార్టీ ల నేతలు క్యాడర్‌తో మంతనాలు జరుపుతున్నారు. ఎ మ్మెల్యేలు కూడా తమ నియోజకవర్గాల పరిధిలోని గ్రా మ పంచాయతీల్లో రిజర్వేషన్ల వివరాలు తెలుసుకొని ఆ మేరకు పోటీలో గెలుపొందే సత్తా ఉన్న అభ్యర్థుల ను ప్రోత్సహిస్తున్నారు. మండలస్థాయి నాయకుల నుం చి ఫీడ్‌ బ్యాక్‌ తీసుకుంటూ పంచాయతీ ఎన్నికల్లో గె లుపే లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహాలను రచిస్తు న్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వు అయిన గ్రామ పంచాయతీల్లో కొంచెం ఆర్థిక పరపతి ఉన్నవారు పోటీకి సన్నద్దం అవుతున్నారు. సర్పంచ్‌ పదవులకు పోటీ ఎక్కువగా ఉన్న చోట అసంతృప్తికి చోటు లేకుం డా పార్టీ నాయకులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గ్రామాల్లో ఒకరినిక సర్పంచ్‌, మరొకరిని ఎంపీటీసీ అభ్యర్థిగా బరిలోకి దింపాలనే యోచనలో ఉన్నారు. ప ల్లెల్లో పట్టు సాధించేందుకు అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌, బీజేపీలు వ్యూహాలకు పదును పెడుతున్నా యి. పార్టీ గుర్తులు లేకపోయినా తమ కార్యకర్తలను గెలిపించుకోవాలనే లక్ష్యంతో కసరత్తు చేస్తున్నాయి.

కాంగ్రెస్‌ వ్యూహాలు...

అధికార కాంగ్రెస్‌ పార్టీ గెలుపు ధీమాతో కొద్ది నెలల నుంచే పావులు కదుపుతోంది. బీసీలకు 42 శాతం రి జర్వేషన్లు కల్పించడం ద్వారా సర్పంచ్‌, వార్డు సభ్యుల స్థానాలను గంప గుత్తగా తన ఖాతాలో వేసుకోవడా నికి ప్రయత్నించినప్పటికీ కోర్టు తీర్పులతో ఆ వ్యూహం బెడిసికొట్టింది. అయినా కూడా పార్టీ పరంగా జనరల్‌ స్థానాల్లో వీలయినంత ఎక్కువ మంది బీసీలకు మద్ద తు ఇవ్వడం ద్వారా వారి గెలుపు కోసం కృషి చేయా లని యోచిస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో మహిళా ఓ టర్లే కీలకం కావడంతో వారిని ప్రసన్నం చేసుకొనే ప్ర యత్నం చేస్తోంది. ఇందులో భాగంగా ఇందిరమ్మ చీర ల పంపిణీతోపాటు స్వయం సహాయక సంఘాల స భ్యుల మద్దతును కూడ గట్టేందుకు వడ్డీలేని రుణాల ను విడుదల చేసింది. ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత బస్సు, గృహజ్యోతి వంటి సంక్షేమ పథకాలను, అభివృద్ధి పను లను ప్రజల్లోకి తీసుకు వెళ్లడం ద్వారా గ్రామీణ ఓట ర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేపట్టింది.

బీఆర్‌ఎస్‌కు సవాల్‌...

పంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ కూడా తన వంతు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. గత పార్లమెంట్‌, అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవి చూసిన ఆ పార్టీ, పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా పునుజ్జీవనం పొందే ఆలోచనలో ఉంది. ఈ మే రకు పదేళ్ల పాలనలో పంచాయతీల అభివృద్ధికి చేసిన కృషి, గ్రామాల్లో కల్పించిన మౌలిక వసతులను గుర్తు చేయడం ద్వారా పల్లె ఓటర్లను ప్రసన్నం చేసుకొనే ది శగా వ్యూహాలను రచిస్తోంది. చెన్నూరు, బెల్లంపల్లి ని యోజక వర్గాల పరిధిలోని పల్లెల్లో బీఆర్‌ఎస్‌కు ఇప్ప టికీ గట్టి పునాదులే ఉన్నాయి. క్యాడర్‌తోపాటు క్రియా శీల నాయకులు ఉన్నారు. వారందరిలో ఉత్సాహం నిం పడం ద్వారా పంచాయతీ ఎన్నికల్లో గెలుపు కోసం మాజీ ఎమ్మెల్యేలు, మాజీ జడ్పీటీసీ, ఎంపీటీసీలు, స ర్పంచ్‌లు నడుం భిగిస్తున్నారు. మరోవైపు గత అసెంబ్లీ ఎన్నికల్లో మంచిర్యాల నియోజక వర్గంలో ఆ పార్టీ మూడో స్థానానికి పడిపోవడం ప్రస్తుత పంచాయతీ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర వైఫలం కారణంగా పార్టీ క్యాడర్‌ పెద్ద ఎత్తున ఫిరాంపులకు పాల్పడింది. ఈ క్రమంలో పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందడం ఆ పార్టీకి సవాల్‌గా మారింది.

గెలుపు కోసం బీజేపీ ఆరాటం...

ఇదిలా ఉండగా బీజేపీ కూడా పంచాయతీ ఎన్నిక ల్లో ఖాతాలను తెరవాలనే యోచనతో ఉంది. వీలైనంత వరకు తమ పార్టీ నాయకులు సర్పంచులుగా గెలిచేలా వ్యూహరచనలు చేస్తోంది. వాస్తవానికి గత అసెంబ్లీ ఎ న్నికల్లో మంచిర్యాల నియోజక వర్గంలో బీజేపీ ద్వి తీయ స్థానంలో నిలబడటం ఆ పార్టీ క్యాడర్‌లో కొంత మేర ధైర్యం నింపింది. గత పంచాయతీ ఎన్నికల్లో బీ జేపీ మద్దతు దారుల్లో ఎక్కువ మంది సర్పంచులుగా గెలవలేకపోయారు. దీంతో ప్రస్తుత పంచాయతీ ఎన్నిక ల్లో వీలైనంత ఎక్కువ స్థానాలను గెలుచుకోవడం ద్వా రా గ్రామ స్థాయిలో ఆ పార్టీ పునాదులను పట్టిష్టం చేసుకొనే పనిలో నిమగ్నమైంది.

Updated Date - Nov 28 , 2025 | 12:25 AM