Food Poisoning: చేగుంట మదర్సాలో ఫుడ్ పాయిజన్
ABN , Publish Date - Sep 24 , 2025 | 04:24 AM
మెదక్ జిల్లా చేగుంట మండలం ఇబ్రహీంపూర్ గ్రామంలోని మదర్సాలో సుమారు పది మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్‌తో అస్వస్థతకు గురయ్యారు..
అస్వస్థతకు గురైన పది మంది విద్యార్థులు
నిలకడగా విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి
చేగుంట/రామాయంపేట, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): మెదక్ జిల్లా చేగుంట మండలం ఇబ్రహీంపూర్ గ్రామంలోని మదర్సాలో సుమారు పది మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్‌తో అస్వస్థతకు గురయ్యారు. సోమవారం రాత్రి భోజనం చేసిన తర్వాత వారికి కడుపునొప్పి, వాంతులు, విరోచనాలు అయ్యాయి. వెంటనే స్పందించిన మదర్సా నిర్వాహకులు విద్యార్థులను రామాయంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ మంగళవారం ఉదయం ఆస్పత్రికి వెళ్లి విద్యార్థుల ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.