Share News

kumaram bheem asifabad- అన్నదానాలు..ప్రత్యేక పూజలు..

ABN , Publish Date - Sep 04 , 2025 | 12:03 AM

జిల్లా కేంద్రంలోని అయా గణేష్‌ మండలీల వద్ద అన్నదానాలు, ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి. సాయినగర్‌లోని ఓంసాయి గణేష్‌ మండలి, బజారువాడి సమర్థసాయి గణేష్‌ మండలి వద్ద మహిళలు కుంకుమ పూజలు నిర్వహించారు. వేద పండితులు నిమ్మకంటి సంతోష్‌శర్మ, సాయిల ఆధ్వర్యంలో గణపతి పూజ అనంతరం కుంకుమపూజ నిర్వహించారు

kumaram bheem asifabad- అన్నదానాలు..ప్రత్యేక పూజలు..
కుంకుమ పూజలు నిర్వహిస్తున్న మహిళలు

ఆసిఫాబాద్‌రూరల్‌, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని అయా గణేష్‌ మండలీల వద్ద అన్నదానాలు, ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి. సాయినగర్‌లోని ఓంసాయి గణేష్‌ మండలి, బజారువాడి సమర్థసాయి గణేష్‌ మండలి వద్ద మహిళలు కుంకుమ పూజలు నిర్వహించారు. వేద పండితులు నిమ్మకంటి సంతోష్‌శర్మ, సాయిల ఆధ్వర్యంలో గణపతి పూజ అనంతరం కుంకుమపూజ నిర్వహించారు. మహిళలు ఏకరూప దుస్తులతో అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించారు. అనంతరం కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. డీసీసీ అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్‌రావు, వన్‌ నేషన్‌ వన్‌ ఎలక్షన్‌ జిల్లా కన్వీనర్‌ అరిగెల నాగేశ్వర్‌రావు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అరిగెల మల్లిఖార్జున్‌, సీఐ బాలాజీ వరప్రసాద్‌, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు ఖాండ్రే విశాల్‌లు ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో వ్యాపారస్తులు రఫీక్‌ జివానీ, తాటిపెల్లి అశోక్‌, కమిటీ సభ్యులు శంకర్‌, కిషన్‌గౌడ్‌, గిరిగౌడ్‌, ప్రదీప్‌, మహేష్‌గౌడ్‌, ప్రహ్లద్‌, శైలేష్‌, సంతోష్‌, రాఘవచారి తదితరులు పాల్గొన్నారు.

కాగజ్‌నగర్‌, (ఆంధ్రజ్యోతి): కాగజ్‌నగర్‌ ఓం శ్రీ సాయి గణేష్‌ మండలి వద్ద సబ్‌ కలెక్టర్‌ శ్రద్దా శుక్లా బుధవారం పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వినాయక విగ్రహానికి పూజలు చేశారు. అనంతరం మండలి కమిటీ సభ్యులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ల వైద్య సురేఖ, బాలు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. భక్తులకు సబ్‌ కలెక్టర్‌ అన్నదానం చేశారు.

జైనూర్‌, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని పవర్‌హౌస్‌ గణేశ్‌ యూత్‌ మండలి ఆధ్వర్యంలో బుధవారం మహిళలు సామూహిక కుంకుమార్చన పూజ నిర్వహించారు. సిర్పూర్‌(యు) మెయిన్‌ రోడ్డులో ప్రతిష్ఠంచిన గణనాథుడికి నరెందర్‌ ఆద్వర్యంలో భక్తులు పూజలు చేశారు. కార్యక్రమంలో మండలి అధ్యక్షుడు జనార్దన్‌, గోపాల్‌, దేవిదాస్‌, పరెందర్‌, రామారావ్‌, దేవరావ్‌, మహేందర్‌, ప్రహ్లద్‌,బాలాజీ, చిమ్నాజీ, రఘునాథ్‌, సుధాకర్‌, సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 04 , 2025 | 12:03 AM