రాజీపడదగిన కేసులపై దృష్టి పెట్టాలి
ABN , Publish Date - Dec 18 , 2025 | 11:11 PM
న్యాయవాదు లు, పోలీసు అధికారులు అంద రూ పెండింగ్‌లో ఉన్న, రాజీప డదగ్గ క్రిమినల్ కేసులు, సివిల్ కేసుల పరిష్కారానికి కృషి చే యాలని జూనియర్ సివిల్ న్యా యాధికారి, మండల న్యాయ సే వాధికార సంఘం చైర్మన్ దమ్ము ఉపనిషద్వాని కోరారు.
- జాతీయ లోక్ అదాలత్‌పై సన్నాహక సమావేశం
కొల్లాపూర్, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి) : న్యాయవాదు లు, పోలీసు అధికారులు అంద రూ పెండింగ్‌లో ఉన్న, రాజీప డదగ్గ క్రిమినల్ కేసులు, సివిల్ కేసుల పరిష్కారానికి కృషి చే యాలని జూనియర్ సివిల్ న్యా యాధికారి, మండల న్యాయ సే వాధికార సంఘం చైర్మన్ దమ్ము ఉపనిషద్వాని కోరారు. ఈనెల 21వ తేదీన నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌పై బార్ అసోసియేషన్, ఏజీపీ, ఏపీపీలు పోలీసు శాఖ, బ్యాంకు అధికా రులతో స్థానిక జూనియర్ సివిల్ న్యాయాధికారి కోర్టుల ప్రాంగణంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి 2వ అదన పు జూనియర్ సివిల్ న్యాయాధికారి శరణ్య హా జరయ్యారు. పెంట్లవెల్లి, పెద్దకొత్తపల్లి స్టేషన్లకు సంబంధించి ఎక్కువ కేసులు పరిష్కారమయ్యే విధంగా సహకరించాలని కోరారు. సమావేశం లో ఏపీపీ శిరీష, బార్‌అసోసియేషన్ అధ్యక్షు డు పోతుల నాగరాజు, ఏజీపీ పిరంగి గోవింద్, లోక్‌అదాలత్ సభ్యులు కురుమూర్తి, మోహన్ లాల్, లీగల్ ఎయిడ్ కౌన్సిల్ నిరంజన్, రామల క్ష్మమ్మ, న్యాయవాదులు వసంతరెడ్డి, చి న్నకుర్మ య్య, రామన్‌గౌడ్, పెంట్లవెల్లి ఎస్‌ఐ మురళి, ఎక్సైజ్ ఎస్‌ఐ, కోర్టు డ్యూటీ పోలీసు అధికారు లు, లోక్ అదాలత్ సిబ్బంది, న్యాయ శాఖసి బ్బంది, బ్యాంకుల సిబ్బంది హాజరయ్యారు.