kumaram bheem asifabad-వెనుకబడిన విద్యార్థులపై దృష్టి సారించాలి
ABN , Publish Date - Jul 31 , 2025 | 10:53 PM
చదువులో వెనుకబడిన విద్యార్థులపై అధ్యాపకులు ప్రత్యేక దృష్టి సారించాలని అదనపు కల్కెటర్ దీపక్ తివారి అన్నారు. గురు వారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించి రిజిస్టర్లు పరిశీలించారు. విద్యార్థుల హాజరు పట్టిక, మౌలిక సదుపాయాలను అడిగి తెలుసుకున్నా రు.
ఆసిఫాబాద్ రూరల్, జూలై 31(ఆంధ్రజ్యోతి): చదువులో వెనుకబడిన విద్యార్థులపై అధ్యాపకులు ప్రత్యేక దృష్టి సారించాలని అదనపు కల్కెటర్ దీపక్ తివారి అన్నారు. గురు వారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించి రిజిస్టర్లు పరిశీలించారు. విద్యార్థుల హాజరు పట్టిక, మౌలిక సదుపాయాలను అడిగి తెలుసుకున్నా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ విద్యారంగాన్ని అభివృద్ధి చేసే విధంగా అనేక కార్యక్రమాలు చేపట్టి విద్యార్థులకు సకల సదుపాయాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించడం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ క్రమంలో కళావాల విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సదుపాయాలు కల్పిం చడంతో పాటు నిష్ణాతులైన అధ్యాపకులతో విద్యాబోధన అందించాలని చెప్పారు. వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. కళాశాలలో చేయాల్సిన మరమ్మతులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ తెలిపారు. అనంతరం ఆర్‌ఆర్ కాలనీలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. పనులను వేగవంతం చేయాలని సూచించారు.