kumaram bheem asifabad- రహదారి ప్రమాదాల నియంత్రణపై దృష్టి
ABN , Publish Date - Oct 29 , 2025 | 10:49 PM
జిల్లాలో రహదారి ప్రమాదాలను నివారించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో ఎస్పీ కాంతిలాల్ పాటిల్, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్దశుక్లా, అదనపు ఎస్పీ చిత్తరంజన్, ఆర్డీవో లోకేశ్వర్‌రావులతో కిసి రోడ్లు, భవనాలు, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, రవాణా, ఆర్టీసీ, వైద్య శాఖల అధికారులు, జాతీయ రహదారుల సంస్థ అధికారులతో బుధవారం రహదారి ప్రమాదాల నివారణపై సమీక్ష సమావేశం నిర్వహించారు
ఆసిఫాబాద్, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రహదారి ప్రమాదాలను నివారించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో ఎస్పీ కాంతిలాల్ పాటిల్, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్దశుక్లా, అదనపు ఎస్పీ చిత్తరంజన్, ఆర్డీవో లోకేశ్వర్‌రావులతో కిసి రోడ్లు, భవనాలు, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, రవాణా, ఆర్టీసీ, వైద్య శాఖల అధికారులు, జాతీయ రహదారుల సంస్థ అధికారులతో బుధవారం రహదారి ప్రమాదాల నివారణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రహదారులపై ప్రమాదాలు నియంత్రించేందుకు అవసరమైన సూచికలు ఏర్పాటు చేసి జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. జిల్లాలు ఎక్కువగా ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి రక్షణ పరమైన సూచిక బోర్డులు, వేగ నియంత్రణ హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని, ప్రతి వాహనదారుడు హెల్మెట్, సీటు బెల్టు ధరించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. మదయం సేవించి వాహనాలు నడిపే వారిపై కేసులు నమోదు చేయానలి, జాతీయ రహదారిపై వేగ నియంత్రణ సూచికబోరుడలు ఉన్న గ్రామాలలో సర్వీసు రహదారులకువేగ నియంత్రీకలను ఏర్పాటు చేయాలని తెలిపారు. జాతీయ రహదారిపై ప్రతి అయిదు కిలో మీటర్లకు వేగ నియంత్రణ సూచిక బోర్డులు ఏర్పాటు చేఆలని, ప్రమాదాలు జరిగిన వెంటన క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించేందుకు అంబులెన్స్‌ను జాతీయ రహదారుల సంస్థ అధికారులు అందుబాటులో ఉంచాలని తెలిపారు. పంచాయతీ రాజ్, రోడ్డు భవనాల శాఖ తమ పరిధిలోని రహదారులుపై గుంతలను వెంటనే పూడ్చాలని, కలవర్టలు, వంతెనల మరమ్మతు పనులు పూర్తి చేయాలని తెలిపారు. మున్సిఆలిటీలు, మండల కేంద్రాలలో రహదారులు అక్రమణ జరగకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించా లని, మున్సిపాలిటీల్లో రద్దీగా ఉండే ప్రాంతాలలో రహదారి భద్రతలపై ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలని తెలిపారు. జాతీయ రహదారులపై పశువులు సంచరించకుండా సంబంధిత యజమానులకు నోటీసులు జారీ చేయాలన్నారు. ద్విచక్ర వాహనదారులు వేగంగా వాహనాలను నడపకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు. జిల్లా కేంద్రంలోని సాయిబాబా ఆలయం నుంచి గుండి ప్లై ఓవర్ వంతెన వరకు ప్రధాన రహదారి ప నులు త్వరగా చేట్టాలన్నారు. ఆర్టీసీ బస్సులు, విద్యా సంస్థ బస్సులు కండిషన్‌లో ఉండే విధంగా చర్యలు తెలిపారు. సమావేశంలో ఆయాశాఖల అధికారులు పాల్గొన్నారు.