Share News

ప్రజా సంక్షేమం, పట్టణ అభివృద్ధిపై దృష్టి

ABN , Publish Date - May 14 , 2025 | 11:50 PM

ప్రజా సంక్షేమం, పట్టణ అభి వృద్ధి విషయంలో ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌ వెంకటస్వామి తెలిపారు. పట్టణంలోని 18వ వార్డు గాంధీనగర్‌లో రూ. 5 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు.

ప్రజా సంక్షేమం, పట్టణ అభివృద్ధిపై దృష్టి
కల్యాణలక్ష్మీ చెక్కులను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి

ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి

మందమర్రిటౌన్‌, మే 14 (ఆంధ్రజ్యోతి) : ప్రజా సంక్షేమం, పట్టణ అభి వృద్ధి విషయంలో ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌ వెంకటస్వామి తెలిపారు. పట్టణంలోని 18వ వార్డు గాంధీనగర్‌లో రూ. 5 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ పాలకవర్గం లేని మందమర్రి మున్సిపాలిటీ అభివృద్ధికి మరిన్ని నిధులు మంజూరు చేస్తానని పేర్కొన్నారు. ఇప్పటికే పట్టణంలోని 24 వార్డుల్లో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. దాదా పు రూ. 20 కోట్లకు పైగా పనులు కొనసాగుతున్నాయని, ఈ పనులు 6 నెలల్లో పూర్తి కావస్తాయన్నారు. కాంట్రాక్టర్లు నాణ్యతతో పనులను చేయాల ని, లేదంటే బిల్లులు నిలిపివేస్తామన్నారు. వార్డు ప్రజలు డ్రైనేజీలు, సెప్టిక్‌ ట్యాంకు నిర్మించాలని కోరగా మున్సిపల్‌ కమిషనర్‌ రాజలింగును సెప్టిక్‌ ట్యాంకు కోసం స్థలం పరిశీలించాలని సూచించారు. అనంతరం నాయకులు, ప్రజలు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నా యకులు పాల్గొన్నారు. అనంతరం పట్టణంలోని పలువురు లబ్ధిదారులకు క ల్యాణలక్ష్మి, షాదిముబారక్‌ చెక్కులను పంపిణీ చేశారు.

Updated Date - May 14 , 2025 | 11:50 PM