చేరికలపైనే దృష్టి...
ABN , Publish Date - Dec 05 , 2025 | 12:12 AM
పంచా యతీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ వివిధ పార్టీల నే తలు చేరికలపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నారు. చేరిక లను ఓట్లుగా మార్చుకొనే పన్నాగంతో వివిధ పార్టీల నుంచి విరివిగా వలసలను ప్రోత్సహిస్తున్నారు. దీంతో ఒక పార్టీ నుంచి మరో పార్టీలో చేరే వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ప్రధాన పార్టీలైన బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీలు ఈ ఒరవడిని అవలంభిస్తున్నాయి.
ఎన్నికల వేళ ఓటర్లకు గాలం
-పార్టీలో చేర్చుకొనేందుకు ఆరాటం
-వారిపైనే ఆధారపడుతున్న అభ్యర్థులు
-పెరుగుతున్న ఎన్నికల వ్యయం
మంచిర్యాల, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): పంచా యతీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ వివిధ పార్టీల నే తలు చేరికలపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నారు. చేరిక లను ఓట్లుగా మార్చుకొనే పన్నాగంతో వివిధ పార్టీల నుంచి విరివిగా వలసలను ప్రోత్సహిస్తున్నారు. దీంతో ఒక పార్టీ నుంచి మరో పార్టీలో చేరే వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ప్రధాన పార్టీలైన బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీలు ఈ ఒరవడిని అవలంభిస్తున్నాయి. వివిధ గ్రామాలు, వార్డుల్లోని ద్వితీయ శ్రేణి నాయకు లను చేరదీయడం ద్వారా పంచాయతీ ఎన్నికల్లో తమ బలం పెంచుకొనేందుకు ముఖ్య నాయకులు ఆరాటపడుతున్నారు.
ప్రలోభాలతో మశ్చిక చేసుకునే యత్నం...
పంచాయతీ ఎన్నికల్లో గ్రామాలను కైవసం చేసుకొ నేందుకు వివిధ పార్టీల నాయకులు అన్ని దారులూ వెతుక్కుంటున్నారు. వీలైతే ఏకగ్రీవం...లేదంటే గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. వార్డుల వారీగా కొందరు చోటా మోటా నాయకులను ఎంపిక చేసుకుంటున్న అభ్యర్థులు ఓటర్లను దారితెచ్చే పని వా రికి అప్పగిస్తున్నారు. దీంతో వార్డుల వారీగా నాయకు లు డిమాండ్ చేసినంత ఇవ్వక తప్పని పరిస్థితులు నె లకొన్నాయి. ప్రస్తుతానికి ఇంటింటికీ మద్యం పంపిణీ చేసే బాధ్యతలను అభ్యర్థులు అప్పగిస్తున్నారు.
అందినకాడికి దండుకోవడమే లక్ష్యం....?
జిల్లాలోని మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి నియో జక వర్గాల్లోని చోటా మోటా నాయకులు కొందరు పం చాయతీ ఎన్నికల్లో అందినకాడికి దండుకోవడమే లక్ష్యం గా పావులు కదుపుతున్నట్లు చర్చ జరుగుతోంది. ఎన్నిక లు సమీపిస్తున్న కొద్దీ సర్పంచ్ అభ్యర్థులను తమ దారి కి తెచ్చుకొనే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్ర ధాన పార్టీల్లో నెలకొన్న పోటీని కొందరు ద్వితీయశ్రేణి నాయకులు అవకాశంగా మల్చుకుంటున్నారు. పార్టీలతో సంబంధం లేకుండా డిమాండ్ల పేరిట అందినకాడికి దండుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ బ్లాక్ మెయిల్ రాజకీయాల కారణంగా ప్రధాన పార్టీలు మద్దతునిస్తు న్న పలువురు అభ్యర్థులు అయోమయానికి గురవు తు న్నారు. తమ పరిధిలో ఇంతమంది ఓటర్లు ఉంటారని, వారిని మశ్చిక చేసుకునేందుకు ఇంత మొత్తం కావాలం టూ అభ్యర్థులపై ఒత్తిడి తెస్తున్నారు. అలాగైతేనే పార్టీ మారతామంటూ అల్టిమేటం జారీ చేస్తున్నారు. ఇలా ఒ క పార్టీ కాకుండా పోటీలో ఉన్న అన్ని ప్రధాన పార్టీల మద్దతున్న అభ్యర్థులకు ఇదే పరిస్థితులు ఎదురవుతు న్నట్లు గ్రామాల్లో ప్రచారం జరుగుతోంది. ప్యాకేజీలు మాట్లాడుకుంటూ ఓట్లు వేయిస్తామనే హామీ ఇస్తుండ టంతో విపరీతమైన పోటీ ఎదుర్కొంటున్న అభ్యర్థులు తప్పనిసరి పరిస్థితుల్లో వారి వలలో చిక్కుకుంటున్నారు.
పెరుగుతున్న ఖర్చులు....
పంచాయతీ ఎన్నికల్లోనూ పెద్ద మొత్తంలో డబ్బుల పంపిణీకి తెరలేచినట్లు తెలుస్తోంది. సర్పంచ్ అభ్యర్థు లు కొన్ని చోట్లా రూ. 30 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకు వెచ్చించేందుకూ సిద్ధపడుతున్నట్లు సమాచారం. ద్వితీయ స్థాయి నాయకులకు నిత్యం దావత్‌లు ఏర్పా టు చేయడంతోపాటు ఓటర్లకు బహుమతుల రూపం లో అధికంగా ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యం గా ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్‌లు మ ద్దతిస్తున్న అభ్యర్థులు ఈ దిశగా ప్రయత్నాలు చేస్తున్న ట్లు తెలుస్తోంది. మరోవైపు పంచాయతీ ఎన్నికలను అ ధికార పార్టీ కాంగ్రెస్‌తోపాటు ప్రతిపక్ష పార్టీలైన బీజే పీ, బీఆర్‌ఎస్‌లు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటు న్నాయి. ఈ నేపథ్యంలో తమ పార్టీ మద్దతునిస్తున్న అ భ్యర్థులను గెలిపించుకునేందుకు ఆయా పార్టీల ము ఖ్య నేతలు సైతం డబ్బులు వెదజల్లడానికి ఆలోచించ డం లేదు. వీలైనన్ని పంచాయతీలను తమ ఖాతాల్లో వేసేకోవడానికి ప్రఽధాన పార్టీల నేతలు అలుపెరుగని కృషి చేస్తున్నారు.