Share News

ఆరోగ్య సంరక్షణపై దృష్టి సారించాలి

ABN , Publish Date - Oct 18 , 2025 | 11:41 PM

ఆరోగ్య సంరక్షణకు ప్రతీ ఒక్కరు ప్రాధాన్యతనివ్వాలని స్త్రీ వైద్య నిపుణురాలు డాక్టర్‌ నూర్జహాన్‌ పేర్కొన్నారు.

ఆరోగ్య సంరక్షణపై దృష్టి సారించాలి
పారామెడికల్‌ సిబ్బందికి సీపీఆర్‌పై అవగాహన కల్పిస్తున్న డాక్టర్‌ నూర్జహాన్‌, బృందంలోని డాక్టర్లు

- స్త్రీ వైద్య నిపుణురాలు డాక్టర్‌ నూర్జహాన్‌

నాగర్‌కర్నూల్‌, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి) : ఆరోగ్య సంరక్షణకు ప్రతీ ఒక్కరు ప్రాధాన్యతనివ్వాలని స్త్రీ వైద్య నిపుణురాలు డాక్టర్‌ నూర్జహాన్‌ పేర్కొన్నారు. ఆరోగ్య రంగం, చికిత్సలో వస్తున్న విప్లవాత్మకమైన మార్పులను విద్యావంతులకు అవగాహన ఏర్పడితే జీవన ప్రమాణాలు మరింత మెరుగు పడుతాయని ఆమె సూచించారు. శని వారం పట్టణంలోని ప్రగతి నర్సింగ్‌ హోంలో డాక్టర్లు నూర్జహాన్‌, గౌతమ్‌, సురేష్‌, ఉదయ్‌ కుమార్‌, అలీంలు అవగాహన సదస్సు ని ర్వ హించారు. మనిషి స్పృహ తప్పి పడిపోయిన గుండె సంబంధమైన సమస్యలతో బాధపడుతు న్నప్పుడు కార్డియో పల్మనరీ, రీసోస్టేషన్‌ వారి ప్రాణాలను కాపాడడంలో దోహదపడుతుంద న్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై ప్రత్యే కంగా దృష్టి సారించి అవగాహన సదస్సులు నిర్వహిస్తుండడం సంతోషదాయకమైన పరిణా మమని డాక్టర్లు పేర్కొన్నారు. ఇంకా సూక్ష్మస్థా యిలో కూడా ప్రజలను చైతన్యవంతులను చేస్తే భారతదేశంలో అకాల మరణాల రేటు త గ్గుతుందని వారు పేర్కొన్నారు.

Updated Date - Oct 18 , 2025 | 11:41 PM