Share News

ఉపాధి కోర్సులపై మొగ్గు...

ABN , Publish Date - Sep 04 , 2025 | 11:57 PM

ఇంటర్‌ మీడి యట్‌ తరువాత ఎంతో మంది విద్యార్థులు సాధారణ డిగ్రీలు చేయడం ద్వారా మంచి ఉపాధి అవకాశాలు ఉండడం లేదనే భావన విద్యార్థుల్లో నెలకొంది. పైగా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్‌లు కూడా రావడం లేదు. ఒకవేళ్ల వచ్చినా ఏళ్ల తరబడి సన్నద్ధమైతే తప్ప ఉద్యో గం వచ్చే పరిస్థితి లేదు. దీంతో యువతీ, యువకులు ఉపాధి కోర్సులు చేస్తే జీవితంలో స్థిరపడవచ్చనే భావ నతో ఉన్నారు.

ఉపాధి కోర్సులపై మొగ్గు...

సాంప్రదాయ డిగ్రీ చదువులపై విద్యార్థుల అనాసక్తి

ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో భర్తీకాని సీట్లు

జిల్లాలోని 4 కళాశాలలో సగానికిపైగా ఖాళీలే

బెల్లంపల్లి, సెప్టెంబరు4 (ఆంధ్రజ్యోతి): ఇంటర్‌ మీడి యట్‌ తరువాత ఎంతో మంది విద్యార్థులు సాధారణ డిగ్రీలు చేయడం ద్వారా మంచి ఉపాధి అవకాశాలు ఉండడం లేదనే భావన విద్యార్థుల్లో నెలకొంది. పైగా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్‌లు కూడా రావడం లేదు. ఒకవేళ్ల వచ్చినా ఏళ్ల తరబడి సన్నద్ధమైతే తప్ప ఉద్యో గం వచ్చే పరిస్థితి లేదు. దీంతో యువతీ, యువకులు ఉపాధి కోర్సులు చేస్తే జీవితంలో స్థిరపడవచ్చనే భావ నతో ఉన్నారు. బీఎస్సీ డిజిటల్‌ మార్కెటింగ్‌, అడ్వటైజిం గ్‌, మార్కెటింగ్‌ సేల్స్‌, హెల్త్‌కేర్‌ మేనేజ్‌మెంట్‌, బీ ఎఫ్‌ఎస్‌టీ తదితర కోర్సుల వైపు విద్యార్థులు మళ్లుతున్నారు. ఈ కారణంగా డిగ్రీ కళాశాలల్లో సగానికి పైగా ఖాళీలే ఉంటున్నాయి. మారుతున్న పరిస్థితులకు అను గుణంగా డిగ్రీ కళాశాలల్లో కొత్త కోర్సులను పెంచుకో వడానికి విద్యార్థులకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తే డి గ్రీలో చేరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మౌలిక వసతులూ కరువే..

ఇంటర్‌మీడియట్‌ పూర్తి చేసుకున్న విద్యార్థులు డిగ్రీ లో చేరేందుకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి దోస్తు (డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ) ద్వారా ప్రవేశాలు కల్పిస్తోంది. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా ఉన్న డిగ్రీ క ళాశాలల్లో 3 విడతల్లో ప్రవేశాలు చేపట్టారు. విద్యార్థు లు మాత్రం డిగ్రీపై అనాసక్తి చూపడంతో భారీగా సీ ట్లు మిగిలాయి. దీనికితోడు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో విద్యార్థులకు సరిపడా తరగతి గదులు లేకపోవడం క నీస మౌలిక సదుపాయాలు సరిగ్గా లేకపోవడం వంటి సమస్యలు విద్యార్థులకు శాపంగా మారుతున్నాయి. ఏ దేమైన డిగ్రీ కళాశాలల్లో 50శాతం సీట్లు భర్తీ కా కపోవడం గమనార్హం.

ప్రచారం చేసినా స్పందన అంతంతే...

జిల్లాలో బెల్లంపల్లి, చెన్నూర్‌, మంచిర్యాల, లక్షెట్టిపే టలో నాలుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉన్నాయి. ఈ కళాశాలల్లో బీఏ, బీకాం, బీజడ్సీ, బీఎస్సీ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సులకు గాను సంబం ధిత కళాశాల అధ్యాపకులు మూడు విడతల్లో సీట్ల కే టాయింపు కోసం నోటిఫికేషన్‌ విడుదల చేశారు. అంతే గాకుండా అడ్మిషన్ల సమయంలో సంబంధిత కళాశాల అధ్యాపకులు ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో చేరాలంటూ ప్రచారాలు సైతం చేపట్టారు. అయినప్పటికీ విద్యార్థులు డిగ్రీ కళాశాలల్లో చేరడానికి అనాసక్తి చూపారు. బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో ఈ ఏడాది 660 సీట్లకు గాను కేవలం 327 మంది విద్యార్థులే చేరారు. చెన్నూర్‌ డిగ్రీ కళాశాలలో 480 సీ ట్లకు గాను కేవలం 221మంది విద్యార్థులు ప్రవేశాలు సాధించారు. మంచిర్యాల డిగ్రీ కళాశాలలో మొత్తం 360 సీట్లకు 196 మంది మాత్రమే చేరారు. లక్షెట్టిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 660 సీట్లు ఉండగా 245 మంది డిగ్రీ కళాశాలలో చేరారు. మొత్తం జిల్లాలోని నా లుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 2160 సీట్లు ఉండగా కేవలం 989 మంది విద్యార్థులు మాత్రమే డిగ్రీలో ప్ర వేశాలు పొందారు.

సమస్యల వలయంలో డిగ్రీ కళాశాలలు...

జిల్లాలోని డిగ్రీ కళాశాలల్లో సమస్యలు తాండవమె త్తుతున్నాయి. 11 నెలలుగా ప్రభుత్వం నిధులు రావడం తో సమస్యలు మరింత ఝటిలమవుతున్నాయి. బెల్లం పల్లిలోని ప్రబుత్వ డిగ్రీ కళాశాలలో మౌలిక వసతులు సైతం లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎ దుర్కొంటున్నారు. విద్యార్థులకు క్రీడామైదానం, తరగ దులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు. అలాగే తాగునీరు సైతం అందుబాటులో లేక పోవడంతో చేసేదేమి లేక ఉపాధ్యాయులు తమ సొంత ఖర్చులతో తాగునీటిని తెప్పిస్తున్నారు. పలు డిగ్రీ కళా శాలల్లో మౌలిక సదుపాయాలు లేకపోవడంతో విద్యా ర్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డిగ్రీ కళాశాల ల్లో విద్యార్థులు చేరకపోవడానికి ఇదో కారణం సైతం చెప్పుకోవచ్చు.

Updated Date - Sep 04 , 2025 | 11:57 PM