దాడులు, దౌర్జన్యాలు కాదు..అభివృద్ధిపై దృష్టి పెట్టండి
ABN , Publish Date - Dec 16 , 2025 | 11:39 PM
రాష్ట్ర ప్రభుత్వం బీఆర్‌ఎస్ నాయకులపై దాడులు, దౌర్జన్యాలు మానుకుని అభివృద్ధిపై దృష్టి పెట్టాలని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు, బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యతో కలిసి ఆయన మాట్లా డారు.
బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్
మంచిర్యాల కలెక్టరేట్, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రభుత్వం బీఆర్‌ఎస్ నాయకులపై దాడులు, దౌర్జన్యాలు మానుకుని అభివృద్ధిపై దృష్టి పెట్టాలని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు, బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యతో కలిసి ఆయన మాట్లా డారు. కాళేశ్వరంలో లక్ష కోట్ల అవినీతి జరిగిందని, సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. కాళేశ్వరం అంచనాలో లక్ష కోట్ల రూపాయలు ఎక్కడ నుంచి వచ్చాయని ప్రశ్నించారు. మేడిగడ్డనే సాంకేతిక లోపాన్ని కాళేశ్వరంపై రుద్ది కాళేశ్వరం ప్రాజెక్టుపై అభూత కల్పనలు చేయడం ముఖ్యమంత్రికే చెల్లిందన్నారు. గత ప్రభుత్వంలో నీటి ఎద్దడి లేదని, ఈ ప్రభుత్వంలో రైతులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. మేడి గడ్డ, అన్నారం ప్రాజెక్టుల వద్ద ఇసుక గుట్టలు గుట్టలుగా పోసి అక్రమ ఇసుక దందాలు చేస్తూ మంత్రి అక్రమాలకు, అన్యాయాలకు తెరలేపుతున్నాడన్నారు. రాష్ట్రంలో రెండేళ్లుగా ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి చేయ లేదని, పూర్తిగా విఫలమైందన్నారు. సమస్యలపై దృష్టి పెట్టకుండా రాజకీయ కక్ష సాధింపులకే సీఎం రేవంత్ రెడ్డి పరిమితం అయ్యారన్నారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదని, దాడులు మాని అభివృద్ధి చేయాలన్నారు. ఉమ్మడి జిల్లాలో ఏకైక మంత్రిగా ఉన్న వివేక్ అధిక నిధులు తెచ్చి అభివృద్ధి చేయాల్సి ఉండగా దౌర్జన్యాలు, దాడులు చేస్తున్న వారిని ప్రోత్సహిస్తున్నారని, ఇది మానుకోవాలన్నారు. స్థానిక ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ నాయకులు కత్తులో దాడులు చేయడం దుర్మార్గమన్నారు. దాడి చేసిన వారిపై ఏసీపీకి ఫిర్యాదు చేశామని వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. బెల్లంపల్లి, మంచిర్యాల, చెన్నూరు నియోజకవర్గాల్లో బెది రింపు రాజకీయాలు నడుస్తున్నాయన్నారు. సమావేశంలో నస్పూర్, మంచిర్యాల పట్టణ అధ్యక్షుడు అక్కూరి సుబ్బన్న, గాదె సత్యం, సీనియర్ నాయకుడు రాజారమేష్, రమేష్, తిరుపతి, అత్తి సరోజ, బేర సత్యనా రాయణ, పల్లె భూమేష్, పవన్, సురేందర్‌రెడ్డి, రవిగౌడ్, రాజు పాల్గొన్నారు.