Road Accident: పండుగ వేళ విషాదంవేర్వేరు ఘటనల్లో ఐదుగురి దుర్మరణం
ABN , Publish Date - Sep 30 , 2025 | 04:29 AM
బతుకమ్మ పండు గ వేళ సోమవారం జరిగిన వేర్వేరు ఘటనలు ఐదు కుటుంబాల్లో విషాదం నింపాయి. దసరా పండుగకు సామగ్రి తీసుకుని ఆటోలో వస్తున్న ముగ్గురు యువకులు రోడ్డు.....
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్): బతుకమ్మ పండు గ వేళ సోమవారం జరిగిన వేర్వేరు ఘటనలు ఐదు కుటుంబాల్లో విషాదం నింపాయి. దసరా పండుగకు సామగ్రి తీసుకుని ఆటోలో వస్తున్న ముగ్గురు యువకులు రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడగా.. బతుకమ్మ పూల కోసం వెళ్లి ఇద్దరు చనిపోయారు. నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం ముదిగొండ పరిధి మటికతండాకు చెందిన రాత్లావత్ భాస్కర్ (30), రాత్లావత్ వినోద్(28), ఉల్చరాల జర్పులతండాకు చెందిన సభావట్ రవి(29), జర్పుల కృష్ణలు హైదరాబాద్‌లో ఆటో నడుపుతుంటారు. సోమవారం తండాకు వచ్చిన వారు.. ఆటోలో పండుగ సామగ్రి, వస్తువులు తీసుకెళ్తుండగా ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. భాస్కర్, వినోద్, రవి అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన జర్పుల కృష్ణను హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన ఆటోలో పోలీసులు మద్యం సీసాలను గుర్తించారు. మరో ఘటనలో.. ఛత్తీ్‌సగఢ్‌కు చెందిన సోడి లక్ష్మణ్(22) జీవనోపాధి కోసం ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం చిట్యాల గొత్తికోయ గూడెంలో ఉంటున్నాడు. ఓ రైతుకు బతుకమ్మ పూలు తెచ్చేం దుకు చిట్యాల వద్ద చెరువుకు వెళ్లి నీటమునిగి చనిపోయాడు. అలాగే, నల్లగొండ జిల్లా మునుగోడు శేరిగూడెంకు చెందిన సురకంటి అశోక్‌రెడ్డి(59) లారీ డ్రైవర్. హయత్‌నగర్‌లోని గ్రీన్‌వుడ్ కాలనీలో ఉంటున్నాడు. సోమవారం బతుకమ్మ పండుగ ఉండడంతో పూలు తీసుకురావడానికి వెళ్తూ ప్రమాదవశాత్తూ మూతలేని సెప్టిక్ ట్యాంకులో పడి మృతి చెందాడు.