Share News

kumaram bheem asifabad- తొలి విడత ప్రశాంతం

ABN , Publish Date - Dec 12 , 2025 | 01:00 AM

జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలలో భాగంగా గురు వారం జరిగిన తొలి విడత ఎన్నికల పోలీంగ్‌ ప్రశాంతంగా జరిగింది. జైనూరు, కెరమెరి, సిర్పూర్‌(యూ), లింగాపూర్‌, వాంకిడి మండాలాల్లోని 114 గ్రామ పంచాయతీలకు గాను ఇప్పటికే ఏడు పంచాయతీలు ఏకగ్రీవం కాగా వాంకిడి మండలంలోని తేజగూడ గ్రామపంచాయతీకి నామినేషన్‌ దాఖలు కాకపోవడంతో గురువారం 106 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్‌ ప్రారంభమైంది.

kumaram bheem asifabad- తొలి విడత ప్రశాంతం
వాంకిడిలో ఓటు వేసేందుకు క్యూలో ఉన్న ఓటర్లు

- అత్యధికంగా కెరమెరిలో 83.38 శాతం

- 106 పంచాయతీల్లో ఓటు హక్కు వినియోగించుకున్న 76,668 మంది ఓటర్లు

ఆసిఫాబాద్‌, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలలో భాగంగా గురు వారం జరిగిన తొలి విడత ఎన్నికల పోలీంగ్‌ ప్రశాంతంగా జరిగింది. జైనూరు, కెరమెరి, సిర్పూర్‌(యూ), లింగాపూర్‌, వాంకిడి మండాలాల్లోని 114 గ్రామ పంచాయతీలకు గాను ఇప్పటికే ఏడు పంచాయతీలు ఏకగ్రీవం కాగా వాంకిడి మండలంలోని తేజగూడ గ్రామపంచాయతీకి నామినేషన్‌ దాఖలు కాకపోవడంతో గురువారం 106 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్‌ ప్రారంభమైంది. జిల్లాలో చలి తీవ్రత కారణంగా ఉదయం 7 నుంచి 9 గంటల వరకు పోలింగ్‌ మందకొడిగా జరిగింది. ఆ తర్వాత పుంజుకుంది. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు 19.2 శాతం పోలింగ్‌ నమోదు కాగా 11 గంటల వరకు 59.11 శాతం, మధ్యాహ్నం ఒంటిగంట వరకు 77.85 శాతం పోలింగ్‌ నమోదు కాగా పోలింగ్‌ సమయం ముగిసే వరకు క్యూలైన్‌లో ఉన్న ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించు కోగ జిల్లాలో మొత్తం 79.81 శాతంగా పోలింగ్‌ నమోదైంది .జిల్లాలో అత్యధికంగా కెరమెరి మండలంలో 83.38 శాతం పోలీంగ్‌ నమోదు కాగా, అత్యల్పంగా జైనూరు మండలంలో 76.81 శాతం పోలీంగ్‌ నమోదైంది. పోలీంగ్‌ సందర్భంగా ఎక్కడ ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకొలేదు. జైనూరు మండలం లో 24,362 మంది ఓటర్లకు గాను 18,713 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కెరమెరి మండలంలో 22,993 మందికి గాను 19,171 మంది, లింగాపూర్‌లో 8,867 మందికి గాను 7,059 మంది, సిర్పూర్‌(యూ)లో 12,277 మందికి గాను 9,966 మంది, వాంకిడిలో 27,568 మందికి గాను 21,760 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. తొలి విడత ఎన్నికలు జరిగే పోలింగ్‌ కేంద్రాలను జిల్లా కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే, జిల్లా ఎస్పీ నితికా పంత్‌, అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి, ఏఎస్పీ చిత్తరంజన్‌లు సందర్శించి పోలింగ్‌ సరళిని పరిశీలించారు. ఎలాంటి పొరపాట్లు జరుగకుండా ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. పోలింగ్‌ ప్రక్రియ పూర్తయిన తర్వాత అయా గ్రామ పంచాయతీల సర్పంచ్‌, వార్డు స్థానాల ఓట్ల లెక్కింపు చేపట్టి విజేతలను ప్రకటించారు.

జైనూర్‌, (ఆంధ్రజ్యోతి): మండలంలోని మారుమూల గ్రామాల్లో గురువారం ప్రశాంతంగా జరిగింది. మండల వ్యాప్తంగా 76 శాతం పోలింగ్‌ నమోదైందని ఎంపీడీవో సుధాకర్‌ రెడ్డి తెలిపారు. కాగ ఉదయం పూట పోలింగ్‌ చలి కారణంగా మందకొడిగా కొనసాగింది. ఉదయం పది గంట ల ఆనంతరం ఓటర్లు తమ తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు క్యూలో నిలబడ్డారు, ముఖ్యంగా వృధ్ధులను పట్టుకోని పోలింగ్‌ కేంద్రాలకు తీసుకెళ్ళి ఓటు వేయించారు. ఆదేవిధంగా పలు వాహనాల్లో ఓటు వేసేందుకు ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నారు. తమకు అనుకూలంగా ఉన్న అభ్యర్థులకు ఓటు వేసేందుకు పోటి పడ్డారు. ఆదేవిధంగా మారుమూల గ్రామాల్లో పోలింగ్‌ ప్రశాంతంగా జరిగేందుకు సీఐ రమేష్‌ పర్యవేక్షణలో ఎస్సై గట్టి బందో బస్‌ నిర్వహించారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ విధించడంతో ప్రశాంత వాతావరణంలో ఎన్నికల జరిగాయి.

Updated Date - Dec 12 , 2025 | 01:00 AM