kumaram bheem asifabad-పకడ్బందీగా మొదటి విడత ఎన్నికలు
ABN , Publish Date - Dec 12 , 2025 | 01:02 AM
జిల్లాలో మొదటి విడత ఎన్నికల ప్రక్రియ ఎన్నికల నిబంధనలకు లోబడి నిర్వహించామని జిల్లా ఎన్నికల అధికారి, కుమరం భీం కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. జిల్లాలోని వాంకిడి మండలం బెండార గ్రామ పంచాయతీలో గురువా రం నిర్వహించిన పోలింగ్ సరళి, కౌంటింగ్ ప్రక్రియలను జిల్లా ఎస్పీ నితికాపంత్, ఎన్నికల పరిశీలకులు శ్రీనివాస్‌లతో కలిసి పరిశీలించారు.
వాంకిడి, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మొదటి విడత ఎన్నికల ప్రక్రియ ఎన్నికల నిబంధనలకు లోబడి నిర్వహించామని జిల్లా ఎన్నికల అధికారి, కుమరం భీం కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. జిల్లాలోని వాంకిడి మండలం బెండార గ్రామ పంచాయతీలో గురువా రం నిర్వహించిన పోలింగ్ సరళి, కౌంటింగ్ ప్రక్రియలను జిల్లా ఎస్పీ నితికాపంత్, ఎన్నికల పరిశీలకులు శ్రీనివాస్‌లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాఆ్లడుతూ మొదటి విడత పంచాయతీ ఎన్నికల నేపథయంలో ఎన్నికల నిబంధనల ప్రకారం పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు. ఓటరు జాబితా ప్రకారం ఓటింగ్ ప్రక్రియను నిర్వహించాలని, పోలింగ్ నిర్వహణ, ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేశారు. మొదటి విడత ఎన్నికల నిర్వహణ పారదర్శకంగా జరిగిందని, ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ శాతం ఎప్పటికపుపడు నిర్దేశిత నమూనాలో నమోదు చేయడం జరిగిందని తెలిపారు. మధ్యాహ్నం 1 గంట లోపు పోలింగ్ కేంద్రం ఆవరణలో ఓటు వేసేందుకు వరుసలో ఉన్న వారందరికి ఓటు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించడం జరిగిం దని, మధ్యాహ్నం 2 గంటల నుంచి నిర్వహించే ఓట్ల లెక్కింపు ప్రక్రియ పారదర్శకంగా జరగాలని, ఎన్నికల నిబంధనలను ఖదుచ్చితంగా పాటించాలని అధికారులను ఆదేశించారు.
ఆసిఫాబాద్, (ఆంధ్రజ్యోతి): రెండో సాధారణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గురువారం మొదటి ఇడత సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు జరిగిన ఎన్నికల నిర్వహణ వెబ్ కాస్టింగ్ ద్వారా నిశితంగా పర్యవేక్షించామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన వెబ్ కాస్టింగ్ మానిటరిగ్ సెల్ ద్వారా జిల్లా ఎస్పీ నితికాపంత్, ఎనినకల పరిశీలకులు శ్రీనివాస్‌తో కలిసి మొదటి విడత ఎన్నికల సరళిని పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాట్లాడుతూ 2వ సాధారణ పంచాయతీ ఎన్నికలు-2025 మొదటి విడతలో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగిందని తెలిపారు. జిల్లాలో గుర్తించిన సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించి వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించడం జరిగిందని, నెట్ వర్క్ లేని పోలింగ్ కేంద్రాలలో వాకీటాకీ ద్వారా పర్యవేక్షించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఎలాంటి అనుచితమైన సంఘటనలు ఏర్పడినా స్పందించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల విభాగం అధికారులు, తదితరులు పాల్గొన్నారు.