Share News

kumaram bheem asifabad- ఘనంగా తొలి ఏకాదశి

ABN , Publish Date - Jul 06 , 2025 | 10:53 PM

బెజ్జూరు మండలంలో ఆదివారం తొలి ఏకాదశి పర్వదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. మండల కేంద్రంలోని రంగనాయక, శివాలయ, హనుమాన్‌, వీరబ్రహేంద్రస్వామి ఆలయాలతో పాటు వివిధ గ్రామాల్లో భక్తులు తొలి ఏకాదశి సందర్భంగా పూజలు నిర్వహించారు.

kumaram bheem asifabad- ఘనంగా తొలి ఏకాదశి
బెజ్జూరులో పూజలు నిర్వహిస్తున్న మహిళలు

బెజ్జూరు, జూలై 6 (ఆంధ్రజ్యోతి): బెజ్జూరు మండలంలో ఆదివారం తొలి ఏకాదశి పర్వదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. మండల కేంద్రంలోని రంగనాయక, శివాలయ, హనుమాన్‌, వీరబ్రహేంద్రస్వామి ఆలయాలతో పాటు వివిధ గ్రామాల్లో భక్తులు తొలి ఏకాదశి సందర్భంగా పూజలు నిర్వహించారు. ఏకాదశి రోజు ఉపవాస దీలు చేపట్టి ఆలయల్లో ప్రత్యేక మొక్కులు చెల్లించుకున్నారు.

చింతలమానేపల్లి, (ఆంధ్రజ్యోతి): మండలంలోని కర్జెల్లి ఓంకార ఆశ్రమం, చింతలమానేపల్లి వీరాంజనేస్వామి ఆలయంలో ఆదివారం తొలి ఏకాదశి పూజలను భక్తు లు నిర్వహించారు. ఈ సందర్భంగా వీరాంజనేయ స్వామి ఆలయంలో ఎక్కామా ప్రారం భించారు. ఓంకార ఆశ్రమం, రాధాకృష్ణ ఆలయాల్లో రాధా-కృష్ణలను భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

సిర్పూర్‌(టి), (ఆంధ్రజ్యోతి): మండలంలో ఆదివారం తొలి ఏకాదశి పండగను ఘనంగా జరుపుకున్నారు. మహిళలు, భక్తులు బాలాజీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి హరిసంకీర్తన నిర్వహించారు. అర్చకులు గంగు సత్యనారాయణ ఆధ్వర్యంలో ఏకాదశిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Updated Date - Jul 06 , 2025 | 10:53 PM