Share News

ఎట్టకేలకు కదలిక...

ABN , Publish Date - Nov 21 , 2025 | 11:24 PM

గిరిజన (ఏజెన్సీ) భూములను కబ్జా చేయడమే గాకుండా, అందులో అక్రమంగా ఏర్పాటు చేసిన రైస్‌ మిల్లుపై ఎట్టకేలకు రెవెన్యూ అధికారుల్లో కదలిక వచ్చింది.

ఎట్టకేలకు కదలిక...

-అక్రమ రైస్‌ మిల్లుపై సర్వే రిపోర్ట్‌ సమర్పణ

-ఐటీడీఏ ఎస్‌డీసీకి లేఖ రాసిన దండేపల్లి తహసీల్దార్‌

-లేఖ సారాంశం ప్రకారం భూమి కబ్జా వాస్తమే

-ఇప్పటికైనా అక్రమాల డొంక కదిలేనా...?

-అక్షర సత్యమైన ’ఆంధ్రజ్యోతి’ కథనం

మంచిర్యాల, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): గిరిజన (ఏజెన్సీ) భూములను కబ్జా చేయడమే గాకుండా, అందులో అక్రమంగా ఏర్పాటు చేసిన రైస్‌ మిల్లుపై ఎట్టకేలకు రెవెన్యూ అధికారుల్లో కదలిక వచ్చింది. మం చిర్యాల ఆర్డీవో శ్రీనివాసరావు ఆదేశాల మేరకు దండే పల్లి తహసీల్దార్‌ రోహిత్‌ దేశ్‌పాండే తన సిబ్బందితో విచారణ జరిపించి, ఉట్నూరులోని ట్రైబల్‌ వెల్ఫేర్‌ స్పె షల్‌ డిప్యూటీ కలెక్టర్‌కు ఈ నెల 17న సమగ్ర లేఖ రా శారు. లేఖలో మండలంలోని ముత్యంపేట శివారు స ర్వే నంబర్‌ 18లోని భూమిని స్థానిక వ్యాపారి ముద్ద సాని వేణుగోపాల్‌ అక్రమంగా చేజిక్కించుకొని రైస్‌ మి ల్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. తహసీల్దార్‌ లేఖ తో గిరిజన భూమి అన్యాక్రాంతం విషయమై ’ఆంధ్ర జ్యోతి’లో 12 నవంబరు 2024న ’ఏజెన్సీ భూమి కబ్జా’ శీర్షికన ప్రచురితమైన కథనం అక్షర సత్యమని తేలింది.

ఏడాదిగా కొనసాగిన విచారణ....

ఏజెన్సీ భూమి కబ్జా జరిగిన విషయం వెలుగులోకి వచ్చిన తరువాత సంబంధిత అధికారులు కేవలం ఉ త్తర ప్రత్యుత్తరాలకే పరిమితం అయ్యారు. అలా ఏడా దిపాటు తమ విచారణను కొనసాగిస్తూ వచ్చారు. ఇదే అంశంపై ’ఆంధ్రజ్యోతి’ పలుమార్లు కథనాలు రాయడం తో రెవెన్యూ సిబ్బందితో గతంలో ఒకమారు సర్వే జరి పించిన తహసీల్దార్‌ భూమి కబ్జా జరిగిందని ఐటీడీఏ అప్పటి ప్రాజెక్టు ఆఫీసర్‌ ఖుష్బూ గుప్తాకు లేఖ రా శారు. దీంతో భూమిని స్వాధీనం చేసుకోవాలని పీవో ఆదేశాలు జారీ చేసినప్పటికీ అప్పటి రెవెన్యూ అధికారు లు కాలయాపన చేశారు. ఎట్టకేలకు ప్రస్తుత తహసీ ల్దార్‌ సర్వే రిపోర్టును ఉట్నూర్‌లోని ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఎస్‌డీసీకి అందజేయడం గమనార్హం.

కలెక్టర్‌కు ఫిర్యాదుతో వెలుగులోకి...

గిరిజనుల భూములను గిరిజనేతరుడు కబ్జా చేసిన విషయమై పలువురు గ్రామస్థులు గతేడాది అక్టోబరు 28న కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల విభా గంలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆంధ్ర జ్యోతిలో కథనం ప్రచురితం కావడంతో ఈ విషయమై కలెక్టర్‌ సూచనల మేరకు జిల్లా అప్పటి అదనపు కలె క్టర్‌ సబావత్‌ మోతీలాల్‌ నవంబరు 26న అక్రమంగా రైస్‌ మిల్లు ఏర్పాటు చేసిన స్థలంపై పూర్తిస్థాయిలో వి చారణ జరపాలని దండేపల్లి తహసీల్దార్‌ను ఆదేశిం చారు. అయితే కలెక్టర్‌ ఆదేశాలను ఖాతరు చేయని మండల అధికారులు కబ్జాకు గురైన స్థలంలో ఎటు వంటి విచారణ జరుపలేదు. దీంతో గిరిజనులు ఐటీడీ ఏ పీవోకు ఫిర్యాదు చేశారు. ముత్యంపేట గ్రామం ఏ జెన్సీ ఏరియా కావడంతో రైస్‌ మిల్లు ఏర్పాటు చేసిన గిరిజన భూములను కాపాడాలని కోరుతూ ఐటీడీఏ డై రెక్టర్‌ మర్సుకోల బాపురావు స్థానికులతో కలిసి ఉట్నూ రులోని అప్పటి ప్రాజెక్టు ఆఫీసర్‌ ఖుష్బూ గుప్తాకు లి ఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో తహసీల్దా ర్‌ను సర్వే జరిపించాలని పీవో ఆదేశాలిచ్చారు.

పీవో ఆదేశాలూ బేఖాతర్‌...!

వ్యాపారి కబ్జా చేసిన రెండు సర్వే నంబర్‌లో 18కి సంబంధించి 30 గుంటల స్థలం కబ్జాకు గురైందని వి చారణ జరిపించిన తహసీల్దార్‌ ఆ మేరకు ఉట్నూరు ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఎస్‌డీసీకి లేఖ రాశారు. ఇంత వరకు బాగానే ఉన్నా....సర్వే నంబర్‌ 17లోని 10 గుంటల భూ మి వెనక్కి తీసుకోవాలన్న ఐటీడీఏ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ ఆ దేశాలను మాత్రం అధికారులు ఖాతరు చేయకపోవ డం విమర్శలకు దారి తీస్తోంది. సర్వే నంబర్‌ 17లోని 10 గుంటల భూమిని సదరు వ్యాపారి కబ్జా చేయడం వాస్తవమేనని తేలడంతో అప్పటి ఐటీడీఏ పీవో ఖుష్భూ గుప్తా ఈ ఏడాది ఫిబ్రవరి 6న, ట్రైబల్‌ వెలేర్‌ ఎస్డీసీ జూన్‌ 28న సదరు భూమిని వెనక్కి తీసుకోవాలంటూ దండేపల్లి తహసీల్దార్‌కు లిఖిత పూర్వక ఆదేశాలు జా రీ చేశారు. దాదాపు ఎనిమిది నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఆ దిశగా రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఇటు రెవెన్యూ అధికారు లు, అటు పోలీస్‌ శాఖ మధ్య సమన్వయ లోపం కార ణంగా భూమిని స్వాధీనం చేసుకొనే అంశం కాస్త మరుగున పడింది.

నిలిచిన ఇళ్ల నిర్మాణం....

ముత్యంపేట శివారు సర్వే నంబర్‌ 17లో ఉన్న మొ త్తం 34 గుంటలను 2005లో ఐటీడీఏ పీవో ఆదేశాల మేరకు తహసీల్దార్‌ గ్రామంలోని 12 మంది గిరిజనుల కు ఇళ్ల స్థలాల కోసం కేటాయించారు. కాల క్రమంలో భూమి కబ్జాకు గురికావడంతో గిరిజనులు ఇళ్లు నిర్మిం చుకోలేని పరిస్థితి దాపురించింది. ’ఆంధ్రజ్యోతి’ కథనం తో విచారణ జరిపిన రెవెన్యూ అధికారులు భూమి కబ్జాకు గురైందని తేలినప్పటికీ స్వాధీనం చేసుకోవడం లో మాత్రం జాప్యం చేశారు. ఈ విషయంలో గ్రా మస్థుల ఫిర్యాదు మేరకు అప్పటి ఐటీడీఏ పీవో సైతం భూమిని స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. అయి నా ఇప్పటి వరకు స్వాధీనం చేసుకోకపోవడంతో గిరిజ నులకు ఇళ్లు నిర్మించుకొనే భాగ్యం కలగడం లేదు. ఇ ప్పటికైనా భూమిని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకుంటారా...? లేదా...? అన్న విషయమై వేచి చూడాల్సిందే.

Updated Date - Nov 21 , 2025 | 11:24 PM