ఎట్టకేలకు చెన్నంపల్లిలో భూముల సర్వే
ABN , Publish Date - Nov 16 , 2025 | 11:34 PM
మండలంలోని చెన్నంపల్లి శివారు భూముల్లో మొ క్కజొన్న పండించిన రైతులకు ప్ర భుత్వ మద్ధతు ధర దక్కనుంది.
- మంత్రి జూపల్లి ఆదేశంతో కదిలిన వ్యవసాయ అధికారులు
- రైతుల మొక్కజొన్న పంట కొనుగోలుకు సిద్ధం
కొల్లాపూర్, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని చెన్నంపల్లి శివారు భూముల్లో మొ క్కజొన్న పండించిన రైతులకు ప్ర భుత్వ మద్ధతు ధర దక్కనుంది. చెన్నంపల్లి శి వారులో సర్వే నెంబర్ 87, 223, 10లలో 252 ఎకరాల భూమి ఉంది. గత బీఆర్‌ఎస్ ప్రభు త్వంలో చెన్నంపల్లి శివారులో ఉన్న 252 ఎక రాల భూమి సాగు చేస్తున్న దాదాపు 150 మం ది రైతుల భూములను లావణి పట్టాలుగా గుర్తించి వారందరికీ డిజిటల్ పాస్ బుక్కులు ఇవ్వలేదు. దీంతో డిజిటల్ సైన్ లేని పంటలు క్రాప్ బుకింగ్‌లో లాగిన్ కావడం లేదు. కేవలం డిజిటల్ సైన్ ఉన్న భూములే ఏఈవో లాగిన్ లోకి వస్తాయి. ప్రభుత్వం మొక్కజొన్న పంటకు క్వింటాల్‌కు 2400 మద్దతు ధర చెల్లిస్తుండడం తో వారం 10 రోజుల నుంచి రైతులంతా తమ పంట కొనుగోలుకు క్రాప్ బుకింగ్ చేయాలని స్థానిక వ్యవసాయ కార్యాలయం చుట్టూ ప్రదక్షి ణలు చేశారు. సోమశిల, రామాపురం గ్రామాల మాజీ ప్రజాప్రతినిదులు, కాంగ్రెస్ నాయకులు రైతుల సమస్యను మంత్రి జూపల్లి కృష్ణారావు దృష్టికి తీసుకువెళ్లారు. మంత్రి స్పందించి రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్‌కు సమస్య వివరిం చడంతో శనివారం రాత్రి నాన్ డిజిటల్‌లో ఉన్న డేటాను ఏఈవో లాగిన్‌లో వేశారు. ఆదివారం ఒక్క రోజు మాత్రమే వ్యవసాయ శాఖ అధికా రులు అనుమతులు ఇచ్చారు. దీంతో కొల్లాపూర్ ఇన్‌చార్జి ఏడీఏ చిన్న హుస్సేన్ యాదవ్ 8 మంది ఏఈవోలను తీసుకుని క్షేత్రస్థాయిలో చె న్నంపల్లి శివారు భూముల్లో పంట సాగు వివ రాలను నమోదు చేశారు. ఆదివారం సెలవు రో జైనా వ్యవసాయ అధికారుల ఆదేశానుసారం ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు క్షేత్రస్థాయిలో సర్వే చేశారు. పొలం చూయించి, సంబంధిత డాక్యుమెంట్లు ఇచ్చిన రైతుల పంట ను ఆన్‌లైన్ చేశారు. ఆన్‌లైన్ అయిన క్రాప్ బుకింగ్ 24 గంటల తరువాత అప్‌డేట్ అవు తుందని, వారు ప్రభుత్వ మద్దతు ధరకు మొ క్కజొన్న పంటను అమ్ముకోవచ్చని ఇన్‌చార్జి ఏడీఏ చిన్న హుస్సేన్ యాదవ్ తెలిపారు. ఈ సర్వేలో ఏఈవోలు రాధ, రాముడు, లతీఫ్, సుధారాణి, సలేశ్వరం, రైతులు పాల్గొన్నారు.