Maoist Leader Pak Hanumanthu: మావోయిస్టు అగ్రనేతకు అంతిమ వీడ్కోలు
ABN , Publish Date - Dec 29 , 2025 | 01:35 AM
ఒడిశాలోని కందమాల్ జిల్లా చకపాడ్ అడవుల్లో ఈ నెల 25న జరిగిన పోలీస్ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు...
నల్లగొండ జిల్లా పుల్లెంలలో హనుమంతు అంతిమ యాత్ర
చండూరు, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి) : ఒడిశాలోని కందమాల్ జిల్లా చకపాడ్ అడవుల్లో ఈ నెల 25న జరిగిన పోలీస్ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, ఒడిశా రాష్ట్ర కమిటీ కార్యదర్శి పాక హనుమంతు అలియాస్ ఉయికే గణేశ్(64)కు స్వగ్రామంలో కన్నీటి వీడ్కోలు పలికారు. ఆదివారం నల్లగొండ జిల్లా చండూరు మండలం పుల్లెంలలోని సొంత వ్యవసాయ భూమిలో ఆయన అంత్యక్రియలు ముగిశాయి. ఒడిశాలో పోస్టుమార్టం అనంతరం హనుమంతు మృతదేహాన్ని పోలీసులు ఆయన కుటుంబసభ్యులకు అప్పగించగా ఆదివారం ఉదయం 10.30 గంటల సమయంలో గ్రామానికి తీసుకొచ్చారు. హనుమంతు మృతదేహాన్ని చూసి తోబుట్టువులు బోరున విలపించారు. గ్రామంలో నిర్వహించిన అంతిమ యాత్రకు సీపీఎం, సీపీఐ, సీపీఐ ఎంల్, బీఆర్‌ఎస్ శ్రేణులు భారీగా తరలివచ్చారు.