చివరి రోజు భారీ స్పందన...
ABN , Publish Date - Oct 18 , 2025 | 11:08 PM
వైన్ షాపు టెండర్లకు చివరి రోజైన శనివారం దరఖాస్తు చేసేందుకు వ్యాపారుల నుంచి భారీ స్పందన లభించింది. వైన్ షాపుల టెండర్లు దాఖలుకు నోటి షికేషన్ విడుదలై సుమారు 20 రోజులకు పైగా కావస్తున్నప్పటికీ మొదట్లో దరఖాస్తు ప్రక్రియ మందకొడిగా సాగింది. దరఖాస్తు గ డువుకు ఒక రోజు ముందు కూడా ఆశించిన స్థాయిలో వ్యాపారు ల నుంచి స్పందన రాలేదు.
-మద్యం టెండర్లకు బారులు తీరిన వ్యాపారులు
-ఏకంగా వెయ్యి పై చిలుకు దరఖాస్తులు స్వీకరణ
-గతంతో పోల్చితే స్వల్పంగా తగ్గిన సంఖ్య
-ఈ నెల 23న లక్కీ డ్రా ద్వారా లబ్దిదారుల ఎంపిక
మంచిర్యాల, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): వైన్ షాపు టెండర్లకు చివరి రోజైన శనివారం దరఖాస్తు చేసేందుకు వ్యాపారుల నుంచి భారీ స్పందన లభించింది. వైన్ షాపుల టెండర్లు దాఖలుకు నోటి షికేషన్ విడుదలై సుమారు 20 రోజులకు పైగా కావస్తున్నప్పటికీ మొదట్లో దరఖాస్తు ప్రక్రియ మందకొడిగా సాగింది. దరఖాస్తు గ డువుకు ఒక రోజు ముందు కూడా ఆశించిన స్థాయిలో వ్యాపారు ల నుంచి స్పందన రాలేదు. అయితే చివరి రోజు మాత్రం భారీ సంఖ్యలో వ్యాపారులు దరఖాస్తు చేసేందుకు ముందుకు రావడం గమనార్హం. చివరి రోజు ఏకంగా వెయ్యి పై చిలుకు దరఖాస్తులు స్వీకరించారు. ప్రస్తుతం ఉన్న మద్యం దుకాణాల లైసెన్స్ గడువు నవంబర్ 30తో ముగియనుంది. దీంతో 2025-2027 సంవత్సరానికి గాను కొత్త లైసెన్సుల జారీకి ప్రభుత్వం గత నెల 25న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. జిల్లాలోని మంచిర్యాల, చెన్నూరు, బె ల్లంపల్లి, లక్షెట్టిపేట ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో మొత్తం 73 ఏ4 మ ద్యం షాపుల ఏర్పాటుకు టెండర్లు ఆహ్వానించారు.
దరఖాస్తు రుసుం పెరిగినా తగ్గని మోజు...
మద్యం షాపుల టెండర్లలో పాల్గొనదలిచే వ్యాపారులు గతంలో కంటే అధికంగా దరఖాస్తు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. రెండే ళ్ల కాలపరిమితితో ఒక్కో షాపునకు దరఖాస్తు చేసేందుకు రూ. 3 లక్షల నాన్ రిఫండబుల్ ఫీజును ప్రభుత్వం నిర్ణయించింది. గత మద్యం పాలసీలో దరఖాస్తు రుసుం రూ. 2 లక్షలు ఉండగా, ఈ సారి అదనంగా లక్ష రూపాయలను పెంచింది. అయినప్పటికీ మ ద్యం వ్యాపారం మోజు తగ్గలేదు. జిల్లాలో మద్యం వ్యాపారం లా భసాటిగా ఉండటం, ఒక వ్యక్తి ఎన్ని దుకాణాలకైనా దరఖాస్తు చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించడంతో లిక్కర్ వ్యా పారుల్లో మంచి స్పందన కనిపించింది. దరఖాస్తుదారులకు లక్కీ డ్రా నిరవిజేతల కొత్త దుకాణాలకు లైసెన్స్ కాలపరిమితి డిసెం బరు 1వ తేదీ నుంచి ప్రారంభమై 2027 నవంబరు 30 వరకు అ మలులో ఉండనుంది. డిసెంబరు ఒకటవ తేదీ నుంచే దుకాణాల్లో మద్యం విక్రయాలు జరుగనున్నాయి.
చివరి రోజు భారీ స్పందన....
వైన్ షాపుల టెండర్లకు దరఖాస్తు చేసుకునేందుకు శనివారంతో గడువు ముగియనుంది. సాయంత్రం ఐదు గంటల వరకే దరఖా స్తు గడువు పూర్తికాగా, అప్పటి వరకు క్యూలో ఉన్నవారిని అధికారులు అనుమతించారు. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైన నాటి నుంచి ఈ నెల 17 వరకు కేవలం 655 దరఖాస్తులు రాగా, చివరి రోజు పెద్ద మొత్తంలో వ్యాపారుల నుంచి స్పందన కనిపించింది. సాయంత్రం 6 గంటల వరకు ఏ కంగా మరో 889 దరఖాస్తులు వచ్చాయి. మొత్తంగా శనివారం వరకు 1544 దరఖాస్తులు వచ్చాయి. కాగా గడువు ముగిసే సమయానికి మంచిర్యాల ఎక్సైజ్ శాఖ పరిధిలో 717 దరఖాస్తులు, బె ల్లంపల్లిలో 382, చెన్నూర్‌లో 211, లక్షెట్టిపేటలో 234 దరఖాస్తులు వచ్చాయి. కాగా గత మద్యం పాలసీతో పొలిస్తే దాదాపు 700పై చిలుకు దరఖాస్తులు తగ్గగా టెండర్ల రూపంలో సుమారు రూ. 21 కోట్ల ఆదాయాన్ని ఆబ్కారీ శాఖ కోల్పోయింది. గత మద్యం పాలసీలో గడువు ముగిసే సమ యానికి జిల్లాలోని నాలుగు ఎక్సైజ్ సర్కిళ్ల పరిధిలో మొత్తం 2242 దరఖాస్తులు రాగా, ఈ సారి పెద్ద మొత్తంలో తగ్గాయి. దరఖాస్తు ప్రక్రియ ముగియగానే, సంబంధిత వ్యాపారుల సమక్షంలో ఈ నెల 23వ తేదీన లక్కీ డ్రా నిర్వహించి లబ్దిదారులను ఎంపిక చేయనున్నారు.