Share News

పింఛన్లు పెంచే వరకూ పోరాటం

ABN , Publish Date - Aug 12 , 2025 | 12:30 AM

ప్రభుత్వం ఆసరా, చేయూత పింఛన్లు పెంచే వరకూ పోరాటం కొనసాగిస్తామని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్ధాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ స్పష్టంచేశారు.

పింఛన్లు పెంచే వరకూ పోరాటం
చిట్యాలలో మాట్లాడుతున్న మంద కృష్ణమాదిగ

ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ

చిట్యాల, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ఆసరా, చేయూత పింఛన్లు పెంచే వరకూ పోరాటం కొనసాగిస్తామని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్ధాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ స్పష్టంచేశారు. నల్లగొండ జిల్లా చిట్యాలలో సోమవారం జరిగిన నకిరేకల్‌, మునుగోడు నియోజకవర్గాల పింఛన్‌దారుల సభలో మాట్లాడారు. వృద్ధులు, వితంతువు, ఒంటరి మహిళల, నేత, గీత, బీడీ కార్మికుల పింఛన్‌ రూ.2నుంచి రూ.4వేలకు, దివ్యాంగుల పింఛన్‌ రూ.6 వేలకు పెంచాలన్నారు. పింఛన్లను పెంచుతామని సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. రూ.100 ఉన్న ఉన్న పింఛన్‌ రూ.4వేల వరకు వచ్చేందుకు ఎమ్మార్పీఎస్‌ కృషి చేసిందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలైనా ఇంకా పింఛన్ల మొత్తాన్ని పెంచలేదని విమర్శించారు. పక్క రాష్ట్రంలో ఆసరా పింఛన్లను రూ.4వేలు, దివ్యాంగుల పింఛన్‌ రూ.6వేలకు పెంచారని గుర్తుచేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం హామీ లు చేయడం లేదని, ప్రశ్నించాల్సిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఫాంహౌ స్‌కే పరిమితమయ్యారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు నరేష్‌, మేడి శంకర్‌, వీహెచ్‌పీఎ్‌స నాయకులు తుమ్మల లక్ష్మారెడ్డి, నాయకులు నక్క అశోక్‌, బకరం శ్రీనివాస్‌, ఇరిగి శ్రీశైలం, ఎరసాని గోపాల్‌, కొత్త వెంకన్న, మేడి కృష్ణ, మంకాల శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

తుంగతుర్తి: వృద్ధులు, దివ్యాంగులు, వితంతు ఫించన్లు పెంచుతామని కాంగ్రెస్‌ సర్కార్‌ మోసం చేసిందని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని జరిగిన సమావేశంలో మాట్లాడారు. పింఛన్లు పెంచకుంటే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని ఓడిస్తామన్నారు. పెన్షన్‌ పెంచడమా? గద్దె దించడమా? ఏదో ఒకటి తేలిపోవాలన్నారు. సెప్టెంబరు 3వ తేదీన హైదరాబాద్‌లో జరిగే మహా గర్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేయడంలో ప్రతిపక్ష నేతలు విఫలమయ్యారన్నారు. అందుకే ప్రజల పక్షాన ఎమ్మార్పీఎస్‌ పోరాటానికి శ్రీకారం చుట్టిందన్నారు. సమావేశంలో గడ్డం ఖాసిం తదితరులు ఉన్నారు.

Updated Date - Aug 12 , 2025 | 12:30 AM