Share News

kumaram bheem asifabad- అరకొర వసతులు

ABN , Publish Date - Aug 06 , 2025 | 11:38 PM

జిల్లాలోని గ్రంథాలయాల్లో సౌకర్యాల లేమితో నిరుద్యోగ యువత అవస్థలు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా మారుమూల ప్రాంతాలతో పాటు కాగజ్‌నగర్‌ లాంటి పట్టణంలోని గ్రంథాలయాల్లో సౌకర్యాలు కరువయ్యాయి. దీంతో నిరుద్యోగ యువత పోటీ పరీక్షలకు పోటీ పడేందుకు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని కేవలం జిల్లా కేంద్రమైన ఆసిఫాబాద్‌లో నూతన భవనం పూర్తయి అన్ని సౌకర్యాలతో ఉంది. మిగిలిన చోట్లయిన కాగజ్‌నగర్‌, సిర్పూర్‌ (టి), కౌటాల, బెజ్జూరు, కెరమెరి, వాంకిడి, జైనూరు, రెబ్బెన తదితర మండల కేంద్రాల్లో నేటికి కూడా లైబ్రరీలకు పక్కా భవనాలు లేవు.

kumaram bheem asifabad- అరకొర వసతులు
కాగజ్‌నగర్‌లోని గ్రంథాలయం

- ఇబ్బందులు పడుతున్న యువత

- పట్టించుకోని అధికారులు

కాగజ్‌నగర్‌ టౌన్‌, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని గ్రంథాలయాల్లో సౌకర్యాల లేమితో నిరుద్యోగ యువత అవస్థలు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా మారుమూల ప్రాంతాలతో పాటు కాగజ్‌నగర్‌ లాంటి పట్టణంలోని గ్రంథాలయాల్లో సౌకర్యాలు కరువయ్యాయి. దీంతో నిరుద్యోగ యువత పోటీ పరీక్షలకు పోటీ పడేందుకు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని కేవలం జిల్లా కేంద్రమైన ఆసిఫాబాద్‌లో నూతన భవనం పూర్తయి అన్ని సౌకర్యాలతో ఉంది. మిగిలిన చోట్లయిన కాగజ్‌నగర్‌, సిర్పూర్‌ (టి), కౌటాల, బెజ్జూరు, కెరమెరి, వాంకిడి, జైనూరు, రెబ్బెన తదితర మండల కేంద్రాల్లో నేటికి కూడా లైబ్రరీలకు పక్కా భవనాలు లేవు. కొన్ని చోట్ల ఇంకా కేంద్రాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. నూతన మండలాల్లో రీడింగ్‌ రూంలు ఏర్పాటు చేస్తామని చెప్పినా వాటి గత ప్రభుత్వంలో ఊసేలేదు. కాగజ్‌నగర్‌ లైబ్రరీలో సుమారు 2000 మంది సభ్యత్యం కలిగి ఉన్నప్పటికీ కేవలం ఎస్పీఎం మిల్లుకు చెందిన ఒక ఇరుకైన గదిలో గత 40 ఏండ్లుగా కొనసాగుతోంది. వేసవి కాలంలో అధిక ఉష్ణోగత్రలు, ఉక్కపో తతో రీడర్స్‌ సతమతమవుతున్నారు. పక్కా భవనం కోసం స్థలం లేక పోవడంతో ఏళ్లుగా నిర్మాణానికి నోచుకోవడం లేదు. ఈ కేంద్రం లోనూ ఫర్నిచర్‌, తదితర సౌకర్యాలు లేవు. కాంపీటేటివ్‌ పుస్తకాలు తదితర మెటీరీయల్‌ ఉన్నప్పటికీ సదుపాయాలు కల్పించడం లేదు.

- మూడు నెలల క్రితం..

రాష్ట్ర గ్రంథాలయాల సంస్థ చైర్మన్‌ డాక్టర్‌ రియాజ్‌, సిర్పూర్‌ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌ బాబు మే 6న పలు గ్రంఽథాలయాలను సందర్శించారు. ఇందులో భాగంగా కాగజ్‌గనర్‌, సిర్పూర్‌ (టి), కౌటాల గ్రంథాలయాల పరిస్థితి చూసి సదుపాయాలు కల్పించేం దుకు హామీ ఇచ్చారు. కౌటాల మండలం కేంద్రంలో కేంద్రం శిథిలావస్థకు చేరడంతో ఐకేపి కేంద్రంలో కొనసాగిస్తున్నారు. సిర్పూర్‌ (టి)లోనూ ఇదే పరిస్థితి ఉండడంతో ఆర్‌ అండ్‌బి శాఖ పరిధిలోని ఒక గదిలోకి మార్పు చేసేందుకు సన్నాహాలు చేసినా ఫలితం లేదు. పరిశీలించి మూడు నెలలు గడుస్తున్నప్పటికీ ఇంకా ఎటువంటి ఆదేశాలు రాలేదు. మౌలిక వసతులు కల్పనకు ఏళ్ల తరబడి వేచి చూస్తున్నా సమస్య పరిష్కారం కోసం ప్రజా ప్రతినిధులు చొరవ చూపడం లేదని నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. గ్రంఽథాలయాల్లో ఫర్నీచర్‌, మంచినీటి వసతి, ఫ్యాన్లు, మరుగు దొడ్లు, మూత్రశాలలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతు న్నారు. లైబ్రరీల వేళల్లో మార్పులు చేసినప్పటికీ పక్కా భవనాలు లేకపో వడంతో నిరుత్సాహం చెందుతున్నారు. నిరుద్యోగ యువత లైబ్రరీలోనే చదువుకునేందుకు గతంలో ఉన్న సమయాలను మార్పు చేశారు. ప్రస్తుతం ఉదయం నుంచి సాయంత్రం ఐదు వరకు లైబ్రరీలను భోజన విరామ సమయం మినహా తెరిచే ఉంచాలని ఆదేశాలు ఇచ్చారని అధికారులు చెబుతున్నారు. ఉద్యోగాల కోసం యువకుల కల సాకారం చేసుకు నేం దుకు నిరుద్యోగులకు వరుస నోటిఫికేషన్స్‌ ప్రకటిస్తున్న ప్పటికీ పేద, మధ్య తరగతి వర్గాల వారికి అందు బాటులో ఉండాల్సిన గ్రంథాల యాల్లో సౌకర్యాలు కరువ య్యాయని చెబుతున్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకో వాలని యువత కోరుతున్నారు.

Updated Date - Aug 06 , 2025 | 11:39 PM