రైతుకు ఎరువులు అందుబాటులో ఉంచాలి
ABN , Publish Date - Nov 18 , 2025 | 11:05 PM
రైతులకు సరిపోను ఎరువులు అందుబాటులో ఉంచాలని జిల్లా వ్యవసాయ అధికారి యశ్వం త్‌రావు ఎరువులు అమ్మే దుకాణపు యజమా నులకుసూచించారు.
- జిల్లా వ్యవసాయ అధికారి యశ్వంత్‌రావు
తిమ్మాజిపేట, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి) : రైతులకు సరిపోను ఎరువులు అందుబాటులో ఉంచాలని జిల్లా వ్యవసాయ అధికారి యశ్వం త్‌రావు ఎరువులు అమ్మే దుకాణపు యజమా నులకుసూచించారు. మండల కేంద్రంలోని ఆగ్రో రైతు సేవ కేంద్రాలను మంగళవారం ఆయన మండల వ్యవసాయ అధికారి కమల్‌కుమార్‌తో కలిసి తనిఖీ చేశారు. ఎరువులు, విత్తనాలు, పు రుగుల మందుల అమ్మకాలకు సంబంధించిన రికార్డులను, ఈపాస్ మిషన్‌ను, ఎరువుల గోదా ములను ఆయన పరిశీలించి దుకాణపు యజ మానులకు పలు సూచనలు చేశారు. నిషేధిత మందులు అమ్మితే కఠిన చర్యలు ఉంటాయ న్నారు. అంతకు ముందు మారేపల్లి రైతు వేదిక లో నిర్వహించిన రైతు నేస్తం వీడియో కాన్ఫరె న్స్‌లో పాల్గొని రైతు బీమా దరఖాస్తులను వెం టనే క్లెయిమ్ అయ్యేలా చూడాలని ఏఈవోలకు సూచించారు. ఏఈవోలు సాయిరాం, సాహిత ఉన్నారు.