రైతులకు అందుబాటులో ఎరువులు
ABN , Publish Date - Jul 26 , 2025 | 11:13 PM
జిల్లా వ్యాప్తంగా రైతులకు అవసరమైన ఎరువులు అందుబాటులో ఉన్నాయని జిల్లా వ్యవసాయ అధికారి యశ్వంత్ రావు అన్నారు.
- జిల్లా వ్యవసాయ శాఖ అధికారి యశ్వంత్ రావు
బిజినేపల్లి, జూలై 26 (ఆంధ్రజ్యోతి) : జిల్లా వ్యాప్తంగా రైతులకు అవసరమైన ఎరువులు అందుబాటులో ఉన్నాయని జిల్లా వ్యవసాయ అధికారి యశ్వంత్ రావు అన్నారు. మండల కేంద్రంలోని పీఏసీఎస్, ప్రైవేట్ ఎరువుల దుకాణా లను శనివారం ఆయన ఆకస్మిక తనిఖీ చేసి మాట్లాడారు. ప్రస్తుతం సాగు చేసి న పంటలకు అవసరమైన ఎరువులను ప్రభుత్వం సరఫరా చేసిందని అన్నారు. ఎరువులు విక్రయించే డీలర్లు ఖచ్చితంగా రైతు పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్ కార్డుతో పాటు సాగు చేసిన పంట వివరా లను నమోదు చేయాలని ఆదేశించారు. ఎరు వుల కొరత ఉందని సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలను, పుకార్లను నమ్మవద్దని రైతులకు తెలిపారు. అలాగే అకాల వర్షాల కార ణంగా పంటలకు వివిధ రకాల తెగుళ్లు సోకే ప్రమాదం ఉందని, వాటి నివారణకు వ్యవసా య శాఖ అధికారులను, శాస్త్రవేత్తలను సంప్ర దించి వారి సూచనల మేరకు నివారణ చర్యలు చేపట్టి పంటను కాపాడుకోవాలని కోరారు. ఆయన వెంట మండల ఇన్‌చార్జీ వ్యవసాయ శాఖ అధికారి కమల్ కుమార్ ఉన్నారు.