Workplace Harassment: ఐఏఎస్ అధికారి పేషీలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగి ఆత్మహత్యాయత్నం
ABN , Publish Date - Sep 13 , 2025 | 04:26 AM
ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి విభాగంలో పనిచేస్తున్న మహిళా కాంట్రాక్ట్ ఉద్యోగి బుధవారం ఆత్మహత్యాయత్నం చేశారు..
హైదరాబాద్, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి విభాగంలో పనిచేస్తున్న మహిళా కాంట్రాక్ట్ ఉద్యోగి బుధవారం ఆత్మహత్యాయత్నం చేశారు. గతంలో ఈమె మీడియా రంగంలో పనిచేశారు. మిస్ వరల్డ్ పోటీలు జరిగినప్పటినుంచి ఈమెను కాంట్రాక్ట్ పద్ధతిలో ఆ విభాగంలో తీసుకున్నారు. అయితే ఆ విభాగంలో కొన్ని వేధింపులు ఎదురవడంతోనే ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై ఆ సీనియర్ ఐఏఎస్ అధికారి శాఖలో ఏం జరుగుతోందనే చర్చ నడుస్తోంది. ప్రస్తుతానికి ఆమెకు ప్రాణాపాయం తప్పినట్లు తెలుస్తోంది.