Tragic Incident: రైలు మిస్సయిందని బస్సెక్కితే..
ABN , Publish Date - Nov 04 , 2025 | 02:47 AM
అనారోగ్యంతో బాధపడుతున్న కుమారుణ్ని హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చూపించేందుకు బయల్దేరిన ఓ తండ్రి దారిలోనే దుర్మరణం పాలయ్యాడు...
కుమారుణ్ని ఆసుపత్రిలో చూపించడానికి బయల్దేరి అనంతలోకాలకు
దౌల్తాబాద్, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): అనారోగ్యంతో బాధపడుతున్న కుమారుణ్ని హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చూపించేందుకు బయల్దేరిన ఓ తండ్రి దారిలోనే దుర్మరణం పాలయ్యాడు. వికారాబాద్ జిల్లా యాలాల్ మండలంలోని చెన్నారం గ్రామానికి చెందిన యం.హనుమంతుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. తన కుమారుడు అశోక్‌ను హైదరాబాద్‌లోని ఈఎన్‌టీ ఆస్పత్రిలో చూపిద్దామని తాండూర్ రైల్వేస్టేషన్‌కు వెళ్లాడు. అప్పటికే రైలు వెళ్లిపోవడంతో తాండూరులో బస్సు ఎక్కాడు. దారిలో జరిగిన ప్రమాదంలో హనుమంతు మృతి చెందగా కుమారుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.