అకాల వర్షంతో అన్నదాతల ఆందోళన
ABN , Publish Date - Apr 27 , 2025 | 11:22 PM
రైతులు అరుగాలం కష్టపడి పండించిన పంటలను అమ్ముకుందామంటే ప్రకృతి కూడా కన్నెర జేసి ఆకాల వర్షం కురువడంతో కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇ బ్బందులు పడ్డారు.
దండేపల్లి, ఏప్రిల్ 27(ఆంధ్రజ్యోతి): రైతులు అరుగాలం కష్టపడి పండించిన పంటలను అమ్ముకుందామంటే ప్రకృతి కూడా కన్నెర జేసి ఆకాల వర్షం కురువడంతో కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇ బ్బందులు పడ్డారు. మండలంలో శనివారం రాత్రి ఈదురు గాలు లతో కూడిన వర్షం కురువడడం, ధాన్యం కుప్పలపై కప్పిన కవర్లు లేచిపోవడంతో కోనుగోలు కేంద్రాల్లో రైతులు అరగోస పడ్డారు. గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఐకేపి కోనుగోలు కేంద్రాల్లో రైతులు ధాన్యం కుప్పలు పోసి ఉంచారు. వర్షం పడుతుందనే భయంతో ధాన్యం కాపాడునేందుకు రైతులు నానా తంటాలు పడుతూ అద్దె కు కవర్లు తీసుకవచ్చి ధాన్యం కప్పులపై కవరు కప్పారు. కోను గో లు కేంద్రాలలో రైతులకు టార్పలిన్ కవర్లు లేకపోవడంతో, వర్షానికి కొందరు రైతులు అద్దెకు కవర్లు తీసుకవచ్చి తడవకుండా కవర్లు కప్పుకున్నారు. ఆదివారం ఉదయం కూడా స్వల్ప వర్షం కురు వ డంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైన అధికారులు స్పందించి కోనుగోలు కేంద్రాలలో టాల్పిలిన్లు కవరు అందుబాటు లో ఉంచాలని రైతులు కోరుతున్నారు. తూకం వేసిన ధాన్యం బస్తా లను వెనువెంట రైస్ మిల్లులకు తరలించే విధంగా చూడాలని రైతులు కోరుతున్నారు.